By: ABP Desam | Updated at : 13 Mar 2023 11:06 AM (IST)
Edited By: omeprakash
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను ప్రకారం అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమనా విద్యార్హత, సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వివరాలు..
మొత్తం ఖాళీలు : 124.
➥ చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ: 01 పోస్టు
➥ టెక్నికల్ ఆఫీసర్/ సి (కంప్యూటర్స్): 03 పోస్టులు
➥ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ: 02 పోస్టులు
➥ స్టేషన్ ఆఫీసర్/ ఎ: 07 పోస్టులు
➥ సబ్-ఆఫీసర్/ బి: 28 పోస్టులు
➥ డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్-కమ్ ఫైర్‌మ్యాన్/ ఎ: 83 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి 10+2, సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి..
➥ చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ: 40 సంవత్సరాలు మించకూడదు.
➥ టెక్నికల్ ఆఫీసర్/ సి (కంప్యూటర్స్): 35 సంవత్సరాలు మించకూడదు.
➥ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్/ ఎ: 40 సంవత్సరాలు మించకూడదు.
➥ స్టేషన్ ఆఫీసర్/ ఎ: 40 సంవత్సరాలు మించకూడదు.
➥ సబ్-ఆఫీసర్/ బి: 40 సంవత్సరాలు మించకూడదు.
➥ డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్-కమ్ ఫైర్‌మ్యాన్/ ఎ: 27 సంవత్సరాలు మించకూడదు
దరఖాస్తు ఫీజు: చీఫ్ ఫైర్ ఆఫీసర్/ఎ, టెక్నికల్ ఆఫీసర్/సి(కంప్యూటర్స్), డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్/ఎ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 500. స్టేషన్ ఆఫీసర్/ఎ, సబ్-ఆఫీసర్/ బి పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 200. డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్-కమ్ ఫైర్‌మ్యాన్/ఎ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ఫిజికల్ అసెస్‌మెంట్ టెస్ట్, కమాండ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైనతేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2023.
Also Read:
NALSAR: నల్సార్ యూనివర్సిటీలో 58 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వివిధ ఫ్యాకల్టీ, ఇతర అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 58 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఐజీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణత, నెట్/ స్లెట్/ సెట్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా మార్చి 31లోగా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియాలో ఉద్యోగాలు- అర్హతలివే!
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ కార్యాలయాల్లో పనిచేయడానికి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి 10వ తరగతి/ బీటెక్/ బీఈ/ బీకామ్/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్‌టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
SSC Selection Posts: 5369 సెలక్షన్ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
IPRC Notification: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 63 ఖాళీలు, అర్హతలివే!
SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!
SAIL Recruitment: బొకారో స్టీల్ ప్లాంటులో 239 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - అర్హతలివే!
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్
MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్ భాషలో ఛాటింగ్!