అన్వేషించండి

NRDRM Fake Notification : తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖలో 6,881 పోస్టుల పేరిట ఫేక్ నోటిఫికేషన్ హల్‌చల్, నిరుద్యోగులారా జాగ్రత్త

Fake Notification: తెలంగాణలో NRDRM పేరిట వైరల్ అవుతున్న నోటిఫికేషన్ ఫేక్ అని గ్రామీణాభివృద్ధి డిప్యూటీ సెక్రటరీ ప్రదీప్ కుమార్‌ స్పష్టంచేశారు. న్యూస్ చెకర్ ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలోనూ ఫేక్‌గా తేలింది.

Fake Notification in Telangana: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రామీణాభివృద్ధిశాఖలో ఉద్యోగాలంటూ భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఇవి ఫేక్ నోటిఫికేషన్లు అని సంబంధింత అధికారులు హెచ్చిరిస్తున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి డిప్యూటీ సెక్రటరీ ప్రదీప్ కుమార్‌ స్పందించినట్లు ఫ్యాకల్టీ వెబ్‌సైట్ కథనం పేర్కొంది. ఈ కథనం ప్రకారం.. ఇది నకిలీ నోటిఫికేషన్ అని ప్రదీప్ కుమార్‌ స్పష్టం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పేరుతో ఎలాంటి విభాగం కానీ, పథకం కానీ లేదని తెలిపారు. జూలై 2022లోనూ ఇదే తరహా నోటిఫికేషన్ వెలువడిందని, అది కూడా నకిలీదిగా తేలిందని చెప్పారు. ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన నిరుద్యోగులకు సూచించారు.

జాతీయ గ్రామీణాభివృద్ధిశాఖ పరిధికి సంబంధించి ఏపీలో 6881, తెలంగాణలో 6881 ఖాళీలు కలిపి మొత్తం 13,762 ఖాళీలు ఉన్నట్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నోటిఫికేషన్ వివరాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందుకు ఫిబ్రవరి 28 తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అయితే ఇది ఫేక్ న్యూస్ అని, దరఖాస్తు చేసుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.  

న్యూస్ చెకర్ ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలోనూ వెల్లడి..
నేషనల్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ రిక్రియేషన్‌ మిషన్‌ (NRDRM) పేరిట వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన ఫేక్ అని న్యూస్ చెకర్ ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలోనూ తేలింది. నిరుద్యోగులను బురిడీ కొట్టించే ప్రయత్నమని పేర్కొంది. ఈ నోటిఫికేషన్లు నకిలీవని స్పష్టం చేసింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ క్రింద NRDRM అని పిలువబడే అటువంటి సంస్థ ఏదీ లేదని, ఈ ఫేక్ యాడ్‌పై అలర్ట్ చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించామని ఐఈసీ విభాగాధిపతి అఖిలేశ్ జా చెప్పినట్లు న్యూస్ చెకర్ ఫ్యాక్ట్ తన కథనంలో ప్రస్తావించింది.

జాగ్రత్తగా ఉండాల్సిందే..
ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగ యువత జాగ్రత్తగా ఉండాలని, నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ నోటిఫికేషన్లను లేదా వాటి వెబ్‌సైట్ వివరాలను తప్పకుండా ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్ డొమైన్లు అడ్రస్‌లు 'gov.in' లేదా 'nic.in'తో ముగుస్తాయని సూచిస్తున్నారు. ఒకవేళ వెబ్‌సైట్ డొమైన్ అడ్రస్‌లో ఏమైనా తేడాలుంటే, అలాంటి వెబ్‌సైట్‌లలోకి వెళ్లకపోవటం మంచిది.

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget