NIEPID: దివ్యాంగ్‌జన్ సికింద్రాబాద్‌లో 09 వివిధ పోస్టులు, వివరాలు ఇలా!
సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్(దివ్యాంగ్‌జన్) వివిధ పోస్టుల భర్తీకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్(దివ్యాంగ్‌జన్) వివిధ పోస్టుల భర్తీకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 09 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 8వ, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నవంబరు 08వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ/ రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 09
పోస్టుల వారీగా ఖాళీలు..
⏩ లెక్చరర్ ఇన్ ఒకేషనల్ కౌన్సిలింగ్ & ఎంప్లాయిమెంట్: 01
⏩ అకౌంటెంట్: 01
⏩ ఎల్‌డీసీ/టైపిస్ట్: 01
⏩ డ్రైవర్: 03
⏩ ప్రిన్సిపాల్: 01
⏩ అసిస్టెంట్: 01
⏩ అకౌంటెంట్(లైన్ వేకెన్సీ): 01
అర్హత: పోస్టును అనుసరించి 8వ, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18-45 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ. 500.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/ రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
చిరునామా: Director, NIEPID, Manovikas nagar, Secunderabad-500009
దరఖాస్తుకు చివరి తేది: 08.09.2023.
ALSO READ:
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో టీచింగ్ పోస్టులు, ఎంపికైతే భారీగా జీతభత్యాలు
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ప్యాకల్టీల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని 23 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. అయితే వీరికి రెగ్యులర్ ఉద్యోగులకన్నా ఎక్కువ జీతాలు ఇవ్వనుండటం విశేషం. కేవలం ఏడాది కాలానికి మాత్రమే ఈ నియామకాలను భర్తీ చేయనున్నారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పెంచుతారు. రెగ్యులర్ నియామకాలు చేపడితే మాత్రమే వీరు ఉద్యోగాల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 26 ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలు ఉండగా.. వాటిలో గాంధీ, ఉస్మానియా, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలను మినహాయించి మిగిలిన 23 కాలేజీల్లో పోస్టులు భర్తీ కానున్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ప్రసార భారతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, హైదరాబాద్ యూనిట్‌లో ఖాళీలు ఎన్నంటే?
న్యూఢిల్లీలోని ప్రసార భారతీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటి ద్వారా వీడియోగ్రాఫర్, సీనియర్ కరస్పాండెంట్, ప్యాకేజింగ్ అసిస్టెంట్, కాపీ ఎడిటర్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, బులెటిన్ ఎడిటర్, బ్రాడ్‌క్యాస్ట్ ఎగ్జి్క్యూటివ్, అసైన్‌మెంట్ కోఆర్డినేటర్, యాంకర్ కమ్ కరస్పాండెంట్ (గ్రేడ్-3), యాంకర్ కమ్ కరస్పాండెంట్ (గ్రేడ్-2), వీడియో పోస్ట్ ప్రొడక్షన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు, అనుభవం, వయోపరిమితి నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైనవారు హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం, దూరదర్శన్ కేంద్రంలో పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
'టెట్' నోటిఫికేషన్ వచ్చేస్తోంది, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు మొదటివారంలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ మూడోవారంలో టెట్ నిర్వహించాలని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ(ఎన్‌సీఈఆర్‌టీ) నిర్ణయించింది. ఇటీవల సమావేశంలో టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. సెప్టెంబర్ 15 ముందు లేదా తర్వాత ఎప్పుడైనా నిర్వహించాలని భావిస్తున్నారు. అంతర్గతంగా టెట్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..