NITC: నిట్- కాలికట్‌లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
NITC Recruitment: కేరళ కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) టెక్నికల్ అసిస్టెంట్ అండ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NITC Recruitment: కేరళ కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) టెక్నికల్ అసిస్టెంట్ అండ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 08 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 12
⏩ టెక్నికల్ అసిస్టెంట్: 12 పోస్టులు
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ లేదా అంతకంటే ఎక్కువతో పాటు సంబంధిత 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 55 సంవత్సరాలు మించరాదు.
⏩ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 04 పోస్టులు
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ అంతకంటే ఎక్కువతో పాటు సంబంధిత 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. లేదా పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ లేదా అంతకంటే ఎక్కువతో పాటు సంబంధిత 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 55 సంవత్సరాలు మించరాదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వేతనం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.30,000, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ. 35,000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 08.04.2024.
ALSO READ:
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో 335 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
NPCL Recruitment: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్), రావత్‌భట రాజస్థాన్ సైట్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైనవారికి నెలకు రూ.7,700 - రూ.8,855 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 4లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో 158 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
DTU Recruitment: ఢిల్లీలోని షహబాద్ దౌలత్‌పూర్‌లోని ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిజైన్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఎకనామిక్స్ (యూఎస్‌ఎంఈ), మేనేజ్‌మెంట్ (యూఎస్‌ఎంఈ), బయో-టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ, స్లెట్/ సెట్, యూజీసీ/ సీఎస్‌ఐఆర్/ ఐకార్/ జీప్యాట్/ గేట్/ ఐసీఎంఆర్/ నెట్- లెక్చర్‌షిప్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. దివ్యాంగ అభ్యర్థులకు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు పమర్పించవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్, ప్రెజెంటేషన్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..