NIEPID: ఎన్‌ఐఈపీఐడీలో 46 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
Telugu Job News: సికింద్రాబాద్‌లోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ (దివ్యాంగజన్) లెక్చరర్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
NIEPID Job Notification: సికింద్రాబాద్‌లోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ (దివ్యాంగజన్) లెక్చరర్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబరు 18లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 46
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులు
ఎన్‌ఐఈపీఐడీ- సికింద్రాబాద్
➥ లెక్చరర్( స్పెషల్ ఎడ్యుకేషన్): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఒక సంవత్సరం డిప్లొమా, బీఈడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఆఫ్ మెంటల్లీ రిటార్డెడ్.
వయోపరిమితి: 45 సంవత్సరాలు ఉండాలి.
➥ లెక్చరర్( రీహాబిలిటేషన్ సైకాలజీ): 01
అర్హత: NIMHANS, బెంగళూరు, సీఐపీ, రాంచీ లేదా ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్ మొదలైన సంస్థల నుంచి క్లినికల్ / రిహాబిలిటేషన్ సైకాలజీలో రెండేళ్ల ఎంఫిల్ కలిగి ఉండాలి. పీహెచ్‌డీ(చైల్డ్ / ఎక్స్‌పరీమెంటల్ కమ్యూనిటీ / ఎడ్యుకేషనల్ సైకాలజీ).
వయోపరిమితి: 45 సంవత్సరాలు ఉండాలి.
➥ రీహాబిలిటేషన్ ఆఫీసర్: 01
అర్హత: సంబధిత విభాగంలో పీజీ డిగ్రీతో పాటు 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు ఉండాలి.
➥ స్టాటిస్టికల్ అసిస్టెంట్: 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు ఉండాలి.
➥ రిసెప్షనిస్ట్-కమ్ టెలిఫోన్ ఆపరేటర్: 01
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఆంగ్లంలో టైపింగ్ వేగం 30 wpm లేదా మాన్యువల్ టైప్‌రైటర్‌పై హిందీలో 25 wpm. ఉండాలి.
వయోపరిమితి: 18-28 సంవత్సరాలు ఉండాలి.
➥ డ్రైవర్: 02
అర్హత: 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. మోటారు మెకానిజంకి సంబంధించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి. కనీసం 2 సంవత్సరాల పాటు మోటారు కారును నడిపిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు ఉండాలి.
➥ ఎంటీఎస్(అటెండర్): 01
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాలు ఉండాలి.
ఎన్‌ఐఈపీఐడీ- నోయిడా
➥ డ్రైవర్: 01
అర్హత: 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. మోటారు మెకానిజంకి సంబంధించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి. కనీసం 2 సంవత్సరాల పాటు మోటారు కారును నడిపిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు ఉండాలి.
➥ ఎంటీఎస్(ఆయా): 01
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆయాగా పని అనుభవం ఉండాలి. CBID సర్టిఫికేట్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాలు ఉండాలి.
ఎన్‌ఐఈపీఐడీ- నవీ ముంబయి
➥ ఎంటీఎస్(అటెండర్): 01
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 18-25 సంవత్సరాలు ఉండాలి.
కాంట్రాక్ట్ పోస్ట్‌లు
ఎన్‌ఐఈపీఐడీ- సికింద్రాబాద్
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్స్): 01
అర్హత: పీడియాట్రిక్స్‌లో ఎండీ కలిగి ఉండాలి. సంబధిత విభాగంలో నాలుగు సంవత్సరాల బోధన లేదా పరిశోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 56 సంవత్సరాలు మించకూడదు.
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్): 01
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ కలిగి ఉండాలి. సూపర్‌వైజరీ కెపాసిటీ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఐదేళ్ల అనుభవంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై అవగాహన ఉండాలి.
వయోపరిమితి: 56 సంవత్సరాలు మించకూడదు.
సీఆర్‌సీ- దావణ్‌గెరె
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్(PMR): 01
అర్హత: ఎంబీబీఎస్, ఎంసీఐ/ఆర్‌సీఐ ద్వారా గుర్తించబడిన పీఎంఆర్/పీడియాట్రిక్స్‌లో పీజీడిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో బోధన లేదా పరిశోధనలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 56 సంవత్సరాలు మించకూడదు.
➥ వర్క్‌షాప్ సూపర్‌వైజర్-కమ్ స్టోర్ కీపర్: 01
అర్హత: 10+2 లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ప్రోస్తేటిక్స్ & ఆర్థోటిక్స్‌లో డిప్లొమా / సర్టిఫికేట్‌తో పాటు సంబంధిత ప్రాంతంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 56 సంవత్సరాలు మించకూడదు.
సీఆర్‌సీ- నెల్లూరు
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్(PMR): 01
అర్హత: ఎంబీబీఎస్, ఎంసీఐ/ఆర్‌సీఐ ద్వారా గుర్తించబడిన పీఎంఆర్/పీడియాట్రిక్స్‌లో పీజీడిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో బోధన లేదా పరిశోధనలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 56 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Director,
NIEPID,
Manovikas Nagar,
Secunderabad-500009.
దరఖాస్తుకు చివరితేది: 18.12.2023.
ALSO READ:
బీఈఎంఎల్ లిమిటెడ్‌లో 101 ఎగ్జిక్యూటివ్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
కృష్ణా జిల్లాలో 164 పారామెడికల్ పోస్టులు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా