(Source: ECI/ABP News/ABP Majha)
NALCO Notification: నాల్కోలో జూనియర్ ఫోర్‌మెన్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి - జీతమెంతో తెలుసా?
NALCO Jobs: నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఏఎల్‌సీఓ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 42 ఖాళీలను భర్తీచేయనున్నారు.
National Aluminium Company Recruitment Notification: నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఏఎల్‌సీఓ) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జూనియర్ ఫోర్‌మెన్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, డ్రస్సర్-కమ్-ఫస్ట్ ఎయిడర్, నర్స్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 42 పోస్టులు
➥ జూనియర్ ఫోర్‌మెన్ (షార్ట్ ఫైరర్/బ్లాస్టర్): 02 పోస్టులు
అర్హత: డిప్లొమా (మైనింగ్/మైనింగ్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఓవర్‌మ్యాన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18.02.2024 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
అనుభవం: 2 సంవత్సరాలు.
జీతం: రూ.36,500-రూ.1,15,000.
➥ జూనియర్ ఫోర్‌మెన్ (ఓవెర్‌మెన్/ మైన్స్): 18 పోస్టులు
అర్హత: డిప్లొమా (మైనింగ్/మైనింగ్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఓవర్‌మ్యాన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18.02.2024 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
అనుభవం: 2 సంవత్సరాలు.
జీతం: రూ.36,500-రూ.1,15,000.
➥ జూనియర్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్): 05 పోస్టులు
అర్హత: డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డ్(ఒడిశా) జారీచేసిన సూపర్‌వైజరీ కాంపిటెన్సీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18.02.2024 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
అనుభవం: 2 సంవత్సరాలు.
జీతం: రూ.36,500-రూ.1,15,000.
➥ జూనియర్ ఫోర్‌మెన్ (సర్వేయర్): 05 పోస్టులు
అర్హత: డిప్లొమా (మైనింగ్/మైనింగ్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సర్వేయర్స్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18.02.2024 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
అనుభవం: 2 సంవత్సరాలు.
జీతం: రూ.36,500-రూ.1,15,000.
➥ జూనియర్ ఫోర్‌మెన్ (సివిల్): 02 పోస్టులు
అర్హత: డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 18.02.2024 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
అనుభవం: 2 సంవత్సరాలు.
జీతం: రూ.36,500-రూ.1,15,000.
➥ ల్యాబొరేటరీ అసిస్టెంట్ (గ్రేడ్-3): 02 పోస్టులు
అర్హత: బీఎస్సీ ఆనర్స్ (కెమిస్ట్రీ) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18.02.2024 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
అనుభవం: సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
జీతం: రూ.29,500-రూ.70,000.
➥ డ్రస్సర్-కమ్-ఫస్ట్ ఎయిడర్: 04 పోస్టులు
అర్హత: హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18.02.2024 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
అనుభవం: సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
జీతం: రూ.27300-రూ.65000.
➥ నర్స్ గ్రేడ్-3: 04 పోస్టులు
అర్హత: మెట్రిక్/ హయ్యర్ సెకండరీ/ ఇంటర్ (సైన్స్)తోపాటు GNM లేదా డిప్లొమా/బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18.02.2024 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
అనుభవం: సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
జీతం: రూ.29,500-రూ.70,000.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు, సంస్థ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన జూనియర్ ఫోర్‌మెన్ అభ్యర్థులకు రాతపరీక్ష, ఇతర పోస్టుల అభ్యర్థులకు రాతపరీక్షతోపాటు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎంపికలో రాతపరీక్షకు 60 మార్కులు, ట్రేడ్ టెస్ట్‌కు 40 మార్కులు కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.01.2024
➥ దరఖాస్తు చివరి తేదీ: 18.02.2024.