MDL: మజగావ్‌డాక్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో 200 అప్రెంటిస్ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!
MDL Vacancies: ముంబయిలోని మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 అంప్రెటిస్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది.

MDL Recruitment Of Engineering Diploma, Engineering Graduate & General Stream Apprentice: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అంప్రెటిస్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 200 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, జనరల్ స్ట్రీమ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా, డిగ్రీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 05 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అకడమిక్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 200
⏩ డిప్లొమా అప్రెంటిస్: 30
విభాగాల వారీగా ఖాళీలు..
* సివిల్ ఇంజినీరింగ్: 05
* కంప్యూటర్ ఇంజినీరింగ్: 05
* ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 10
* మెకానికల్ ఇంజినీరింగ్: 10
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 1.03.2025 తేదీ నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
⏩ జనరల్ స్ట్రీమ్ అప్రెంటిస్: 50
విభాగాలు: బ్యాచిలర్ ఆఫ్ కామర్స్(బీకామ్), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్(బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ (బీఎస్‌డబ్ల్యూ).
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్(బీకామ్), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్(బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ (బీఎస్‌డబ్ల్యూ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 1.03.2025 తేదీ నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
⏩ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 120
విభాగాల వారీగా ఖాళీలు..
* సివిల్ ఇంజినీరింగ్: 10
* కంప్యూటర్ ఇంజినీరింగ్: 05
* ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 25
* టెలికాం. ఇంజినీరింగ్: 10
* మెకానికల్ ఇంజినీరింగ్: 60
* షిప్ బిల్డింగ్ టెక్నాలజీ లేదా ఇంజినీరింగ్/ నావల్ ఆర్కిటెక్చర్: 10
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 1.03.2025 తేదీ నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, జనరల్ స్ట్రీమ్ అప్రెంటిస్‌లకు రూ.9000; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.01.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.02.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

