UPSC: సివిల్స్ ఫలితాల్లో పాలమూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC Civil results: సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో ఆదిత్య శ్రీవాత్సవ మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్ రెండో ర్యాంకు సాధించగా.. మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్య రెడ్డి మూడో ర్యాంకు కైవసం చేసుకుంది.
UPSC Civils Final Results Toppers: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023 తుది ఫలితాలను (UPSC Final Results) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. తుది ఫలితాల ద్వారా మొత్తం 1016 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్-347, ఈడబ్ల్యూఎస్-115, ఓబీసీ-303, ఎస్సీ-165, ఎస్టీ-86 మంది అభ్యర్థులు ఉన్నారు. సర్వీసుల వారీగా చూస్తే.. ఐఏఎస్ పోస్టులకు 180 మంది, ఐఎఫ్ఎస్ పోస్టులకు 37 మంది, ఐపీఎస్ పోస్టులకు 200 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్‌లో గ్రూప్-ఎ విభాగానికి 613 మంది, గ్రూప్-బి విభాగానికి 113 మంది ఎంపికయ్యారు.
పాలమూరు అమ్మాయికి మూడో ర్యాంకు..
సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో ఆదిత్య శ్రీవాత్సవ మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్ రెండో ర్యాంకు సాధించగా.. మహబూబ్‌నగర్‌కు చెందిన దోనూరు అనన్య రెడ్డి మూడో ర్యాంకు కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 50కి పైగా అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలుస్తోంది. గతేడాది 40కి పైగా ర్యాంకులు సాధించగా.. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది.
* ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి ర్యాంకులు వచ్చాయి. వరంగల్ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు వచ్చింది. గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్‌కు 568 ర్యాంకు వచ్చింది. శివనగర్‌కు చెందిన కోట అనిల్ కుమార్‌కు 764వ ర్యాంకు వచ్చింది. జయసింహారెడ్డికి ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. కిరణ్‌కు ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్ రావొచ్చు. అనిల్ కుమార్‌కు ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023 టాప్-10 ర్యాంకర్లు వీరే..
అభ్యర్థి పేరు | సాధించిన ర్యాంకు |
ఆదిత్య శ్రీవాత్సవ | 1వ ర్యాంకు |
అనిమేష్ ప్రధాన్ | 2వ ర్యాంకు |
దోనూరు అనన్యా రెడ్డి | 3వ ర్యాంకు |
పి.కె. సిద్ధార్థ్ రామ్‌కుమార్ | 4వ ర్యాంకు |
రుహానీ | 5వ ర్యాంకు |
సృష్టి దేబాస్ | 6వ ర్యాంకు |
అనుమోల్ రాథోడ్ | 7వ ర్యాంకు |
ఆశిష్ కుమార్ | 8వ ర్యాంకు |
నౌసిన్ | 9వ ర్యాంకు |
ఐశ్వర్యం ప్రజాపతి | 10వ ర్యాంకు |
తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎంపికైన అభ్యర్థులు..
అభ్యర్థి పేరు | సాధించిన ర్యాంకు |
దోనూరు అనన్యారెడ్డి | 3వ ర్యాంకు |
మెరుగు కౌశిక్ | 22వ ర్యాంకు |
నందల సాయి కిరణ్ | 27వ ర్యాంకు |
జయసింహారెడ్డి | 103వ ర్యాంకు |
పింకిస్ ధీరజ్ రెడ్డి | 173వ ర్యాంకు |
అక్షయ్ దీపక్ | 196వ ర్యాంకు |
భానుశ్రీ | 198వ ర్యాంకు |
ప్రదీప్ రెడ్డి | 382వ ర్యాంకు |
వెంకటేష్ | 467వ ర్యాంకు |
పూల ధనుష్ | 480వ ర్యాంకు |
కె. శ్రీనివాసులు | 526వ ర్యాంకు |
సాయితేజ | 558వ ర్యాంకు |
సయింపు కిరణ్ | 568వ ర్యాంకు |
పి. భార్గవ్ | 590వ ర్యాంకు |
అర్పిత | 639వ ర్యాంకు |
శ్యామల | 649వ ర్యాంకు |
సాక్షి కుమార్ | 679వ ర్యాంకు |
చౌహాన్ | 703వ ర్యాంకు |
జి.శ్వేత | 711వ ర్యాంకు |
కోట అనిల్ కుమార్ | 764వ ర్యాంకు |
ధనుంజయ్ కుమార్ | 810వ ర్యాంకు |
లక్ష్మీ భానోతు | 828వ ర్యాంకు |
అభ్యర్థులకు ఫలితాలపై ఏమైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చునని యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. సమాచారం కోసం గానీ, లేదా స్పష్టత కోసం అన్ని వర్కింగ్ డేస్‌లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 011 23385271, 011 23098543, 011 23381125 ల్యాండ్ లైన్ నెంబర్లలో లేదా ఫెసిలిటేషన్ కౌంటర్‌లో సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది.