LIC ADO Recruitment: 9394 ఉద్యోగాల దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు, వెంటనే అప్లయ్ చేయండి! మారిన పరీక్ష తేదీ!
ఏడీవో పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ పోస్టుల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయినవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
లైఫ్ ఇన్‌స్య్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్(ఏడీవో) పోస్టుల భర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 9394 ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలో మొత్తం 1408 ఏడీఓ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ పోస్టుల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 10తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయినవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ పరీక్షలు (ప్రిలిమినరీ/ మెయిన్ ఎగ్జామినేషన్), ఇంటర్వ్యూ, ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ లేదా ఫైనాన్స్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ విభాగంలో కనీసం రెండేళ్లు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థుల వయసు 01.01.2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
పోస్టుల పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
మెయిన్ పరీక్ష తేదీలో మార్పు..
ఏడీఓ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 12న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష హాల్‌టికెట్లను మార్చి 4 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 8న నిర్వహించాల్సి మెయిన్ పరీక్ష తేదీల్లో ఎల్‌ఐసీ మార్పులు చేసింది. ఏప్రిల్ 24న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
➥ ప్రిలిమినరీ పరీక్ష ..
మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ-35 ప్రశ్నలు-35 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ-35 ప్రశ్నలు-35 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. అయితే ఇంగ్లిష్ పరీక్షను (30 మార్కులు) కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తారు. అంటే 75 మార్కులకే ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. ఇంగ్లిష్, హిందీలో ప్రశ్నలు అడుగుతారు.
➥ మెయిన్ పరీక్ష ..
మొత్తం 160 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. 160 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ & న్యూమరికల్ ఎబిలిటీ నుంచి-50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి-35 ప్రశ్నలు-35 మార్కులు; ఇన్‌స్స్యూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్‌నెస్ నుంచి-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఇక ఎల్‌ఐసీ ఏజెంట్లకు, ఉద్యోగులకు 160 మార్కులకుగాను 100 ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 21.01.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 10.02.2023.
➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ ప్రారంభం: 04.03.2023.
➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 12.03.2023.
➥ మెయిన్ పరీక్షతేదీ: 08.04.2023. (23.04.2023 కి మార్చారు)
Also Read:
SSC MTS: మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజయన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..