KVN Jobs: నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు, అర్హతలివే!
నిజామాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులకు మార్చి 17, 18వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నిజామాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీనియర్ సెకండరీ సర్టిఫికేట్/ఇంటర్, డీఎడ్/డిప్లొమా/బీటెక్/బీఈ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులకు మార్చి 17, 18వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పోస్టుల వివరాలు..
➥ పీఆర్‌టీ
➥ టీజీటీ
➥ కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్
➥ స్పోర్ట్స్ కోచ్
➥ మ్యూజిక్ టీచర్
➥ స్పెషల్ ఎడ్యుకేటర్
విభాగాలు: ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మ్యాథమెటక్స్, సైన్స్, సోషల్ సైన్స్, మ్యూజిక్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీనియర్ సెకండరీ సర్టిఫికేట్/ఇంటర్, డీఎడ్/డిప్లొమా/బీటెక్/బీఈ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక:
Kendriya Vidyalaya Nizamabad,
DIET College Campus,
Near RTO Office,
Nizamabad.
ఇంటర్వ్యూ తేది: 17.03.2023, 18.03.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి.
Also Read:
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో నాన్-టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్ట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తును నోటిఫికేషన్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
కాకినాడలోని (పూర్వపు తూర్పుగోదావరి జిల్లా పరిధి) జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, నేషనల్ హెల్త్ మిషన్(అర్బన్) ఒప్పంద ప్రాతిపదికన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 13 నుంచి మార్చి 16 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియాలో 73 ఉద్యోగాలు - వివరాలు ఇలా!
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) గువాహటిలోని ఎయిమ్స్‌లో పనిచేయడానికి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి/ 10+2/ ఇంటర్మీడియట్/ బీఈ/ బీటెక్/బీఎస్సీ/ గ్రాడ్యుయేషన్/ డిప్లొమా/ డీఎంఎల్‌టీ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 21 వరకుఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. స్కిల్‌టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..