Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్

Vaaradhi Mobile App launched: కాంపిటేటివ్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ ఐటీ కేంద్రంగా పనిచేస్తున్న"  టీమ్ అప్" అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఓ సరికొత్త యాప్ ను రూపొందించింది.

FOLLOW US: 

Vaaradhi Mobile App launched: కరీంనగర్ లో ఏర్పాటైన ఐటీ టవర్ నుంచి తొలిసారిగా ఒక పీపుల్ ఫ్రెండ్లీ సాఫ్ట్ వేర్ ప్రొడక్ట్ ను అందుబాటులో కి తెచ్చింది ఓ టీమ్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో కాంపిటేటివ్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ ఐటీ కేంద్రంగా పనిచేస్తున్న"  టీమ్ అప్" అనే సాఫ్ట్ వేర్ కంపెనీ నిపుణులు ఓ సరికొత్త యాప్ వారధి (Vaaradhi Mobile App) ను రూపొందించారు. ఈ యాప్ ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభించారు. 

జాబ్ చేస్తూనే ప్రిపరేషన్.. 
ఒకవైపు ఇప్పటికే చేస్తున్న ఇతర ఉద్యోగాలు ప్రశాంతంగా చేసుకుంటూనే, లేదా చదువుకోవడం కొనసాగిస్తూనే జాబ్ కి ప్రిపేరవుతున్న వారికి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తరపున ఓ సరికొత్త యాప్ ను స్థానిక ఐటీ టవర్ నిపుణల సహాయంతో అందుబాటులోకి తెచ్చారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా పనిచేస్తున్న వారధి అనే సంస్థ ద్వారా ఇప్పటికే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కల్పిస్తుండటంతో పాటు.. వివిధ రకాల వృత్తి శిక్షణలు అందిస్తున్నారు. 

ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్స్ ఎగ్జామ్స్ తోపాటు, వివిధరకాల కాంపిటేటివ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన మెటిరీయల్ ను యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ యాప్ ను కరీంనగర్ ఐటీ టవర్ (Karimnagar IT Tower) కేంద్రంగా పనిచేస్తున్న టీమ్ అప్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ నిపుణులు తయారు చేసారు. వారధి అనే పేరుతో గూగూల్ ప్లే స్టోర్ లో సెర్చ్ చేసి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ విశేషాలను కలెక్టర్ ఇవాళ వివరించడంతో పాటు.. దాన్నిలాంఛ్ చేసారు. స్థానికంగా ఉన్న సాఫ్ట్ వేర్ నిపుణులు రూపొందించి ఈ యాప్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారంతా వినియోగించుకోవచ్చని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తో పాటు యాప్ తయారీదారులు తెలిపారు.

తెలంగాణలో 80 వేల ఉద్యోగాలు..
రాష్ట్రంలో 90 వేల ఉద్యోగాలు ప్రకటించగా, 10 వేల ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ మార్చి నెలలో ప్రకటించారు. ఇందులో భాగంగానే పోలీస్ బోర్డ్ ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర డిపార్ట్ మెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. టీఎస్‌పీఎస్సీ సైతం గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.

Also Read: TSLPRB Police Jobs 2022: తెలంగాణలో పోలీస్ జాబ్స్‌కు దరఖాస్తులు ప్రారంభం - డైరెక్ట్ లింక్, పోస్టుల అర్హతల వివరాలు ఇవే

Published at : 17 May 2022 09:44 PM (IST) Tags: Telangana Jobs karimnagar Jobs 2022 Vaaradhi Mobile App Job Aspirants Vaaradhi App

సంబంధిత కథనాలు

Smita Sabharwal Job Tips: నిరాశ చెందవద్దు, ప్రణాళికా ప్రకారం ప్రిపేర్ అవ్వాలి - ఉద్యోగార్థులకు స్మితా సబర్వాల్ సూచనలివే

Smita Sabharwal Job Tips: నిరాశ చెందవద్దు, ప్రణాళికా ప్రకారం ప్రిపేర్ అవ్వాలి - ఉద్యోగార్థులకు స్మితా సబర్వాల్ సూచనలివే

Navy Agneepath Recruitment 2022: నేవీలో చేరేందుకు అమ్మాయిలు ఆసక్తి- ఎంతమంది అప్లై చేశారంటే?

Navy Agneepath Recruitment 2022: నేవీలో చేరేందుకు అమ్మాయిలు ఆసక్తి- ఎంతమంది అప్లై చేశారంటే?

Telangana police Jobs: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష తేదీలు విడుదల

Telangana police Jobs: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష తేదీలు విడుదల

TS TET Results 2022: తెలంగాణ టెట్‌లో సత్తాచాటిన ఏపీ యువతి - రెండు టాప్ ర్యాంకులు సాధించిన ప్రకాశం అమ్మాయి

TS TET Results 2022: తెలంగాణ టెట్‌లో సత్తాచాటిన ఏపీ యువతి - రెండు టాప్ ర్యాంకులు సాధించిన ప్రకాశం అమ్మాయి

TS Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఇంజినీరింగ్ శాఖలో 1663 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

TS Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఇంజినీరింగ్ శాఖలో 1663 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

టాప్ స్టోరీస్

MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు

MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు

Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్

Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?

Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?