By: ABP Desam | Updated at : 03 Dec 2022 12:43 PM (IST)
Edited By: omeprakash
యూపీఎస్సీ ఐఆర్ఎంఎస్ ఎగ్జామ్ 2023
ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్(ఐఆర్ఎంఎస్) పరీక్షను 2023 నుంచి యూపీఎస్సీ ద్వారా నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ డిసెంబరు 2న ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్-30 పోస్టులు, మెకానికల్-30 పోస్టులు, ఎలక్ట్రికల్-60 పోస్టులు, కామర్స్ అండ్ అకౌంటెన్సీ-30 పోస్టుల చొప్పున మొత్తం 150 పోస్టులకు ఐఆర్ ఎంఎస్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే యూపీఎస్సీని కోరినట్లు పేర్కొంది. ఈ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ పద్ధతిలో రెండు దశల్లో నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్ష 4 పేపర్లుగా(డిస్క్రిప్టివ్ విధానంలో) రాయాలి.
పరీక్షల్లో పేపర్-ఎ భారతీయ భాషలు, పేపర్-బి ఇంగ్లిష్ క్వాలిఫైయింగ్ పేపర్స్ కింద ఉంటాయి. ఇవి 300 మార్కుల చొప్పున ఉంటాయి. మెరిట్ కోసం పరిగణనలోకి తీసుకొనే అప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1, పేపర్-2 ఒక్కోటి 250 మార్కులకు ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కామర్స్ అండ్ అకౌంటెన్సీల్లో ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌ను అభ్యర్థులు ఎంచుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్షల తరహాలోనే వీటికి సిలబస్, ఆప్షనల్ సబ్జెక్టులు ఉంటాయి.
ఉద్యోగార్థుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సరికొత్త మార్గాల్లో పయనిస్తుంది. ఇటీవలే అభ్యర్థుల సౌకార్యర్థం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మొబైల్ అప్లికేషన్‌ను కూడా వినియోగంలోకి తెచ్చింది. పరీక్షలు, నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులు ఒక్క క్లిక్‌తో సులభంగా తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. మొబైల్ ద్వారా అప్లికేషన్ ఫారాలను నింపడానికి ఈ యాప్ ఉపయోగపడదు.. కానీ, ఆండ్రాయిడ్ యాప్ లింకు ద్వారా అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకొనే సౌలభ్యం ఉంటుంది.
ఇప్పటికే ఓటీఆర్ అందుబాటులోకి...
యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే, అభ్యర్థులు ఇకపై ప్రతిసారి తమ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానాన్ని యూపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీఆర్ వేదికపై ఒకసారి వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు రిజస్ట్రేషన్ చేసుకుంటే చాలు. వేర్వేరు పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓటీఆర్ నంబర్ తెలియజేస్తే సరిపోతుంది. వారి వివరాలన్నీ దరఖాస్తు పత్రంలో ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల అభ్యర్థులకు సమయం ఆదా కావడంతోపాటు దరఖాస్తుల ప్రక్రియ మరింత సులభతరంగా మారుతుంది. దరఖాస్తుల్లో పొరపాట్లకు అవకాశం ఉండదు ఓటీఆర్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థుల సమాచారం యూపీఎస్సీ సర్వర్లలో భద్రంగా ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు పత్రంలో ఈ ఓటీఆర్ నంబర్ నమోదు చేస్తే 70 శాతం దరఖాస్తును పూర్తిచేసినట్లే. యూపీఎస్సీ నిర్వహించే అన్నిపరీక్షలకు ఓటీఆర్ ఉపయోగపడుతుంది. https://www.upsc.gov.in/ లేదా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ల ద్వారా ఎప్పుడైనా సరే ఓటీఆర్‌లో అభ్యర్థులు వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Also Read:
Navy Jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, 1400 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Navy Jobs: టెన్త్ అర్హతతో ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ (ఎంఆర్) పోస్టులు, దరఖాస్తుచేసుకోండి!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
SECL Recruitment: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 405 ఉద్యోగాలు, అర్హతలివే! జీతమెంతో తెలుసా?
TSPSC: గ్రూప్-4 ఉద్యోగార్థులకు అలర్ట్, పరీక్ష తేదీ ప్రటించిన టీఎస్పీఎస్సీ!
TSPSC HWO Recuitment: 581 ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే అప్లయ్ చేసుకోండి!
UPSC IFS Notification: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!
Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని
PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam