News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?

ఐబీపీఎస్‌, రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి మే 31న సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌), రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి మే 31న సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా గ్రూప్‌-ఎ ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌-బి ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఖాళీల వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ జూన్‌ 1న విడుదల కానుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 1న ప్రారంభంకానుంది. జూన్‌ 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

* ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ - సీఆర్‌పీ-XII, 2023

1) గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3)

2) గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) 

అర్హతలు: అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ; మెయిన్ పరీక్షల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2023. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.06.2023.

➥ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సవరణ: 01.06.2023 - 21.06.2023.

➥ ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌(పీఈటీ) తేదీలు: 17.07.2023 - 22.07.2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: ఆగస్టు/సెప్టెంబర్‌, 2023.

➥ ఆన్‌లైన్ ఎగ్జామ్ - మెయిన్స్‌/సింగిల్: సెప్టెంబర్‌, 2023.

➥ ఇంటర్వ్యూ నిర్వహణ: </strong>నవంబర్‌, 2023

Notification

Website

Also Read:

ఐడీబీఐ బ్యాంకులో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1036 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 24 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఐడీబీఐ బ్యాంకులో 136 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 136 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మేనేజర్ పోస్టులకు రూ.48,170 - రూ.69810; అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.63,840- రూ.78,230; డిప్యూటీ జనరల్ మేనేజర్పోస్టులకు రూ.76,010- రూ.89,890గా ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 31 May 2023 09:25 PM (IST) Tags: IBPS RRB Notification RRB Regional Rural Banks Jobs IBPS RRB 2023 Notification IBPS RRB recruitment 2023

ఇవి కూడా చూడండి

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

UPSC CAPF Result: యూపీఎస్సీ- సీఏపీఎఫ్‌ 2023 రాత పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

UPSC CAPF Result: యూపీఎస్సీ- సీఏపీఎఫ్‌ 2023 రాత పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

UPSC NDA Results 2023: యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ-2 2023 రాతపరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!

UPSC NDA Results 2023: యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ-2 2023 రాతపరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!

CIPET: సీపెట్‌ భోపాల్‌లో లెక్చరర్ పోస్టులు, వివరాలు ఇలా

CIPET: సీపెట్‌ భోపాల్‌లో లెక్చరర్ పోస్టులు, వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?

Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?