IBPS PO Admit Card: ఐబీపీఎస్ పీవో మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి
PO Admit Card: ఐబీపీఎస్ పీవో మెయిన్స్ పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్లను విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
IBPS PO Mains Exam Call Letter 2024: ఐబీపీఎస్ పీవో/ఎంటీ మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నవంబరు 23న విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డు పొందవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 30న ఐబీపీఎస్ పీవో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష తేదీ వరకూ అడ్మిట్‌కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఐబీపీఎస్ మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. . పరీక్షరోజు తప్పనిసరిగా వెంటతీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంటతీసుకెళ్లడం మంచిది.
అడ్మిట్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
Step 1: అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. ibps.in
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Online Mains Exam Call Letter for IBPS PO' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేయాలి.
Step 4: వివరాలు నమోదుచేసి సబ్మిట్ చేయగానే అభ్యర్థుల వివరాలు, పరీక్ష కేంద్రం వివరాలతో కూడిన అడ్మిట్ కార్డు దర్శనమిస్తుంది.
Step 5: అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి
IBPS PO మెయిన్స్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 4,455 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) జులై 31న నోటిఫికేషన్ (సీఆర్పీ-పీవో XIV) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అక్టోబరు 19, 20, 30 తేదీల్లో 'ప్రిలిమ్స్' పరీక్షను నిర్వహించింది. పరీక్ష ఫలితాలను నవంబరు 21న విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నవంబరు 30న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా ఐబీపీఎస్ విడుదల చేసింది.
మెయిన్స్ పరీక్ష విధానం:
విభాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ | 45 | 60 | 60 నిమిషాలు |
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ | 40 | 40 | 35 నిమిషాలు |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 35 | 40 | 40 నిమిషాలు |
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ | 35 | 60 | 45 నిమిషాలు |
మొత్తం | 155 | 200 | 3 గంటలు |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్ & ఎస్సే) |
02 | 25 | 30 నిమిషాలు |
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 01.08.2024
➥ ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.08.2024.
➥ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబరు, 2024.
➥ ప్రిలిమినరీ పరీక్ష(ఆన్లైన్) కాల్‌లెటర్ డౌన్లోడ్: అక్టోబరు, 2024.
➥ ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబరు, 2024.
➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: అక్టోబరు/నవంబరు 2024.
➥ మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెటర్ డౌన్లోడ్: నవంబరు 23.
➥ మెయిన్ ఎగ్జామ్: నవంబరు 30.
➥ మెయిన్ ఎగ్జామ్ ఫలితాలు: డిసెంబరు 2024/జనవరి 2025.
➥ ఇంటర్వ్యూ కాల్‌లెటర్ డౌన్లోడ్: జనవరి/ఫిబ్రవరి 2025.
➥ ఇంటర్వ్యూ: జనవరి/ఫిబ్రవరి 2025.
➥ నియామకం: ఏప్రిల్ 2025.