అన్వేషించండి

Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2024-నవంబర్‌ బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది.

Indian Navy Agniveer Notification: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2024-నవంబర్‌  బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 13న ప్రారంభంకానుంది. అభ్యర్థులు మే 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కా(INS Chilka)లో నవంబర్‌ నెలలో శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని వివిధ విభాగాల్లో విధుల్లో నియమిస్తారు. ఎంపికైనవారికి మొదటి సంవత్సరం నెలకు రూ.30,000, రెండో సంవత్సరం నెలకు రూ.33,000, మూడో సంవత్సరం నెలకు రూ.36,500, నాలుగో సంవత్సరం నెలకు రూ.40,000 వేతనంగా ఇస్తారు. ఇతర భత్యాలు అదనంగా ఉంటాయి. 

వివరాలు..

* అగ్నివీర్ - సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌ (SSR) 

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్‌ (లేదా) రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా ఇంజినీరింగ్ డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఆటోమొబైల్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థులు 01.11.2003 – 30.04.2007 మధ్య జన్మించి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.550.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: స్టేజ్-1 (INET- ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ CBT), స్టేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ పరీక్ష) ద్వారా ఎంపికచేస్తారు. 

స్టేజ్- సీబీటీ పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు(ఒక గంట). ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. కాగా పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

శిక్షణ వివరాలు: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కా(INS Chilka)లో నవంబర్‌ నెలలో శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని వివిధ విభాగాల్లో విధుల్లో నియమిస్తారు.

జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం రూ.30,000, రెండో సంవత్సరం రూ.33,000, మూడో సంవత్సరం రూ.36,500, నాలుగో సంవత్సరం రూ.40,000 వేతనంగా ఇస్తారు. ఇతర భత్యాలు అదనంగా ఉంటాయి. 

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.05.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 27.05.2024.

➥ ఫీజు చెల్లింపు తేదీలు: 13.05.2024 - 27.05.2024.

➥ శిక్షణ ప్రారంభం: 2024, నవంబర్‌.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget