అన్వేషించండి

IAF: అగ్నివీర్‌ వాయు నియామక పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్డ్ లింక్ ఇదే!

Agniveer News: భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు (01/ 2024) నియామకాల కోసం నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్ష (ఫేజ్-1) ఫలితాలు నవంబరు 9న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

Agniveer Vayu Written Test Results: భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు (01/ 2024) నియామకాల కోసం నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్ష (ఫేజ్-1) ఫలితాలు నవంబరు 9న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ యూజర్‌నేమ్‌/ ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫేజ్-2లో భాగంగా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2 నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించినవారికి ఫేజ్-3లో మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్, చివరగా ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అగ్నివీర్ వాయు రాతపరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..

అగ్నివీర్ వాయు(01/ 2024) ఖాళీల భర్తీకి సంబంధించి అక్టోబర్‌ 13న ఆన్‌లైన్ రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి ఈ ఏడాది జులైలో నోటిషికేషన్(01/2024) వెలువడిన సంగతి తెలిసిందే.  జులై 27 నుంచి ఆగస్టు 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.

అగ్నివీర్ వాయు ఉద్యోగ అర్హతలు ఇలా..

అర్హతలు..

A. సైన్స్ సబ్జెక్టులకు: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ ఇంగ్లీష్ లో కనీసం 50 శాతం మార్కులు రావాలి. లేదంటే.. 50 శాతం మార్కులతో 3 సంవత్సరాల ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్ వంటి రెండు నాన్-వొకేషనల్ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో రెండేళ్ల వృత్తి విద్యా కోర్సు చేసి ఉండాలి. 

B. సైన్స్ సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టులు

కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో 10+2 చేసి ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లీష్ లో కనీసం 50 శాతం మార్కులు రావాలి. 

వయస్సు పరిధి: అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అంటే అభ్యర్థి 27 జూన్ 2003 నుంచి 27 డిసెంబర్ 2006 మధ్య జన్మించి ఉండాలి. 

కనీస పొడవు: దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థుల ఎత్తు కనీసం 152.5 సెం.మీ ఉండాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు కనీసం 152 సెం.మీ ఉండాలి. పురుష అభ్యర్థుల చెస్ట్ కనీసం 77 సెం.మీ ఉండాలి. 5 సెం.మీ వరకు విస్తరించగలగాలి. 

ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ALSO READ:

స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ ఉద్యోగ పరీక్షల క్యాలెండర్‌-2024 విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల, పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన పరీక్షల క్యాలెండర్‌ను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నవంబరు 7న ప్రకటించింది. 2024-25 సంవత్సరానికి నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్‌ను కమిషన్ విడుదల చేసింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు నిర్వహించే గ్రేడ్‌-సి స్టెనోగ్రాఫర్‌, ఢిల్లీ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సీఏపీఎఫ్‌, జూనియర్‌ ఇంజినీర్‌, మల్టీ టాస్కింగ్‌ సిబ్బంది, హవల్దార్‌ (సీబీఐసీ, సీబీఎన్‌), కానిస్టేబుల్‌ (జీడీ) తదితర ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను క్యాలెండర్‌లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.
పరీక్షల క్యాలెండర్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Embed widget