అన్వేషించండి

India Post Recruitment: ఎగ్జామ్ లేకుండా గవర్నమెంట్ జాబ్.. టెన్త్ పాసైన వారికి ఛాన్స్.. 28 వేలకు పైగా పోస్టల్ జాబ్స్

India Post GDS Recruitment 2026: 10వ తరగతి మార్కులు అర్హత ఆధారంగా పోస్టల్ శాఖ పోస్టులను భర్తీ చేస్తుంది. అయితే పది క్వాలిఫికేషన్ కనుక గ్రామీణ విద్యార్థులకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు శుభవార్త. భారత పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పోస్టల్ సర్కిల్‌లలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దాదాపు 28,740 ఖాళీలను భర్తీ చేయనుంది. 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు జనవరి 31, 2026 నుండి అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్రాంచ్ పోస్టల్ ఆఫీసర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టల్ ఆఫీసర్ (ABPM), మెయిల్ పంపిణీ చేసే గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఎలాంటి రాత పరీక్ష లేదు
ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌లో అతిపెద్ద హైలైట్ పరీక్ష లేకపోవడమే. సాధారణంగా, ప్రభుత్వ ఉద్యోగాలు కఠినమైన పోటీ పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు. అయితే, ఈ పోస్టల్ శాఖ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష ఉండదు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
10వ తరగతిలో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ జాబితా తయారు చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితిలో సడలింపు కూడా ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టంగా తెలిపారు. 

ఈ పోస్టులకు జీతం ఎంత?

ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం కూడా ఇవ్వనున్నారు. పోస్టల్ శాఖ నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్, డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ. 10,000 నుండి రూ. 24,470 వరకు వేతనం చెల్లిస్తారు. బ్రాంచ్ పోస్ట్ ఆఫీసర్ (BPM) పోస్టులకు రూ. 12,000 నుండి రూ. 29,380 వరకు ప్రతినెలా జీతం చెల్లిస్తారని నోటిఫికేషన్ తెలిపింది. 

ముఖ్యమైన తేదీలు

 జనవరి 31, 2026న ఈ పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14, 2026గా నిర్ణయించారు. పరీక్ష రుసుము చెల్లించడానికి ఫిబ్రవరి 16 వరకు అభ్యర్థులకు గడువు ఇచ్చారు. దరఖాస్తులో ఏదైనా తప్పిదం ఉంటే, దానిని సరిదిద్దుకోవడానికి ఫిబ్రవరి 18, 19 తేదీలలో అవకాశం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మెరిట్ జాబితా ఫిబ్రవరి 28, 2026న విడుదల చేయనున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ indiapostgdsonline.gov.inను సందర్శించి మీ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు చివరి నిమిషంలో సర్వర్ సమస్య తలెత్తకుండా ఉండాలంటే, ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి మార్కులు మాత్రమే మెరిట్ గా చూస్తారు కనుక  అవసరం కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సైతం ఇది ఒక సువర్ణావకాశం.

మరిన్ని వివరాలకు: indiapostgdsonline.gov.in వెబ్‌సైట్ సందర్శించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. రైల్వే శాఖ తరహాలో పోస్టల్ శాఖ సైతం ఒకేసారి భారీ మొత్తంలో పోస్టులను భర్తీ చేస్తుంది. కేంద్ర సర్వీసులు కనుక యువత సైతం ఈ పోస్టుల కోసం ఆసక్తి చూపుతారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget