IMSc: ఐఎంఎస్సీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి
IMSc Recruitment: చెన్నైలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ) డైరెక్డ్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
![IMSc: ఐఎంఎస్సీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి IMSc has released notification for the recruitment of faculty posts IMSc: ఐఎంఎస్సీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/fb1e59ad6024d7dc14bc43e5c992c7d01707822677198522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IMSc Recruitment: చెన్నైలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ) డైరెక్డ్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫెలో-ఇ, రీడర్- ఎఫ్, ప్రొఫెసర్-జి, ప్రొఫెసర్-హెచ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిటపికేషన్ ద్వారా 08 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటేషనల్ బయాలజీలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నిబంధనల ప్రకారం ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 08
* ఫ్యాకల్టీ పోస్టులు
➥ఫెలో-ఇ
అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటేషనల్ బయాలజీలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ రీడర్- ఎఫ్
అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటేషనల్ బయాలజీలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ ప్రొఫెసర్-జి
అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటేషనల్ బయాలజీలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ ప్రొఫెసర్-హెచ్
అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటేషనల్ బయాలజీలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
వేతనం: ఫెలో ఇ-పే లెవెల్ 12; రీడర్ ఎఫ్ - పే లెవల్ 13; ప్రొఫెసర్ జి- పే లెవల్ 13A; ప్రొఫెసర్ హెచ్- పే లెవల్ 14.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేదీ: 29.02.2024.
ALSO READ:
ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో 120 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, వాక్-ఇన్ తేదీలివే!
BIOM Trade Apprentice Recruitment: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడలోని 'నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NMDC), బచేలి కాంప్లెక్స్‌లో పలు విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 120 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2 నుంచి 26 వరకు వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఖాళీలను భర్తీచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఎంపిక ఇలా
PNB SO Recruitment: న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank), మానవ వనరుల విభాగం దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1,025 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఖాళీలను అనుసరించి బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 7 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 25 లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)