IIT Job Placements: వార్నీ రోజుకు లక్ష రూపాయల జీతమా, ఏంది భయ్యా ఇదీ?
ఒక్కొక్కరికి 4 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధమైంది. దీన్ని రోజుల్లోకి మారిస్తే.. ఒక్క రోజుకు లక్ష రూపాయల పైనే ఆఫర్ చేసింది.
IIT Job Placements: రెసిషన్ భయం ఓవైపు కమ్మేస్తుంటే... గ్లోబల్ కంపెనీలు మాత్రం రికార్డ్ రేంజ్ ఆఫర్లతో IITల ఎదుట క్యూ కట్టాయి. ప్రస్తుతం IITల్లో ఫస్ట్ ఫేజ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్నాయి. తమకు పనికొస్తాడు అనుకున్న వాళ్లకు కోట్ల రూపాయల జీతం ఇస్తామంటూ ఊరిస్తున్నాయి. చేస్తున్నాయి. గతేడాది రికార్డులను తుడిచేస్తున్నాయి.
రూ. 4 కోట్ల శాలరీ
గ్లోబల్ ప్రొప్రెయిటరీ ట్రేడింగ్ కంపెనీ "జేన్ స్ట్రీట్" ముగ్గురు ఐఐటియన్లకు ఏడాదికి ఏకంగా 4 కోట్ల రూపాయలు చొప్పున జీతాన్ని ఆఫర్ చేసింది. IIT దిల్లీ, IIT బొంబాయి, IIT కాన్పూర్ క్యాంపస్‌ల నుంచి ముగ్గురు స్టుడెంట్స్‌ను సెలెక్ట్ చేసుకున్న ఈ కంపెనీ... ఒక్కొక్కరికి 4 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధమైంది. దీన్ని రోజుల్లోకి మారిస్తే.. ఒక్క రోజుకు లక్ష రూపాయల పైనే ఆఫర్ చేసింది. జేన్ స్ట్రీట్ ఆఫర్ చేసిన జీతమే IITల చరిత్రలో గరిష్ట మొత్తం. క్యాబ్ రైడ్స్ కంపెనీ ఉబెర్.. గత ఏడాది 2 కోట్ల 16 లక్షల రూపాయల వేతనాన్ని ఒకరికి అందించింది. ఇప్పటివరకు ఇదే రికార్డ్.
IIT గౌహతి, IIT రూర్కీలోనూ రికార్డులు బద్ధలు
IIT గౌహతి విద్యార్థులు క్యాప్చర్ చేసిన హయ్యస్ట్ ఆఫర్ 2 కోట్ల 40 లక్షల రూపాయలు. ఈ బ్రాంచ్‌లో, ఉబెర్ గతేడాది ఇచ్చిన ఆఫర్ 2 కోట్ల 5 లక్షల రూపాయలు. దానితో పోలిస్తే.. ఈసారి 17 శాతం జీతం పెరిగింది. IIT రూర్కీ 2 కోట్ల 15 లక్షల రూపాయల జీతాన్ని క్యాచ్ చేసింది. ఇంటర్నేనల్ పొజిషన్ ఆఫర్ చేస్తూ, ఒక కోటి 60 లక్షల రూపాయల జీతం ఇవ్వడానికి ఓ మల్టీ నేషనల్ కంపెనీ ముందుకొచ్చింది. దేశీయ నియామకం కోసం ఇక్కడి విద్యార్థి అందుకున్న గరిష్ట మొత్తం ఒక కోటి 30 లక్షల రూపాయలు. రూర్కీ బ్రాంచ్‌లో పది మంది విద్యార్థులు 80 లక్షల రూపాయలకు పైగా ప్యాకేజీల్ని పట్టుకుపోయారు. ఆరుగురు విద్యార్థులు ఇంటర్నేషనల్ పొజిషన్లకు సెలెక్ట్ అయ్యారు. Spot
IIT మద్రాస్‌కు కంపెనీల వెల్లువ
IIT మద్రాస్‌లో, 2022-23 బ్యాచ్‌కు చెందిన 1722 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్ల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక్కడకు 331 కంపెనీలు వచ్చి వాలాయి. ఫస్ట్ ఫేజ్‌లో 722 మందిని రిక్రూట్ చేసుకున్నది ఈ 331 కంపెనీల టార్గెట్. తొలి దశలో... టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ 14, బజాజ్ ఆటో లిమిటెడ్ 10, చేతక్ టెక్ లిమిటెడ్ 10, జేపీ మోర్గాన్ 9, క్వాల్కమ్ 8, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ 7, మోర్గాన్ స్టాన్లీ 6, గ్రావిటన్ 6, మెక్ కిన్సే & కంపెనీ 5, కోహెసిటీ 5 రిక్రూట్స్ చేసుకున్నాయి.
మద్రాస్ క్యాంపస్‌లో, ఫస్ట్ ఫేజ్‌లోనే రికార్డు స్థాయిలో 445 ఆఫర్లకు అక్కడి విద్యార్థులు ఓకే చెప్పారు. గత ఏడాది వచ్చిన మొత్తం 407 ప్లేస్‌మెంట్స్ కంటే ఇది 10 శాతం ఎక్కువ. ఈ 445 ఆఫర్లలో... 25 మందికి ఏడాది వేతనంగా కోటి రూపాయలు జీతం తీసుకునేందుకు డీల్ కుదుర్చుకున్నారు.
IIT గౌహతిలో మొత్తం 1269 మంది విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు రెడీ అయ్యారు. 78 స్టార్టప్‌లు సహా 264 కంపెనీలు ఇక్కడకు వచ్చాయి. 218 ప్రి-ప్లేస్‌మెంట్ ఆఫర్లను అందించాయి. గత నాలుగేళ్లలో ఇవే హైయస్ట్ ఆఫర్స్. IIT రూర్కీలోనూ 31 కంపెనీలు 365 ఆఫర్లు ఇచ్చాయి.