By: ABP Desam | Updated at : 04 Mar 2023 12:06 AM (IST)
Edited By: omeprakash
ఐఐటీ ఢిల్లీ ఉద్యోగాలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా మార్చి 20 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 89
➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 08 పోస్టులు
అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 45 సంవత్సరాలలోపు ఉండాలి.
అనుభవం: కనీసం 5 సంవత్సరాలు.
➥ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 28 పోస్టులు
అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ. లేదా డిగ్రీతో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.
➥ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 14 పోస్టులు
అర్హత: 55 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలలోపు ఉండాలి.
➥ జూనియర్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ఆఫీసర్: 04 పోస్టులు
అర్హత: 55 శాతం మార్కులతో ఎంకామ్/ఎంబీఏ(ఫైనాన్స్)/ఎప్‌ఏఎస్/సీఏ/ఐసీఎంఏ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా 55 శాతం మార్కులతో బీకామ్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.
➥ అకౌంట్స్ అండ్ ఆడిట్ అసిస్టెంట్: 18 పోస్టులు
అర్హత: 55 శాతం మార్కులతో బీకామ్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలలోపు ఉండాలి.
➥ సూపరింటెండింగ్ ఇంజినీర్: 02 పోస్టులు
అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ) లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్/ఎలక్ట్రికల్) హోదాలో కనీసం 8 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. (లేదా) 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ) లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్/ఎలక్ట్రికల్) హోదాలో కనీసం 13 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 55 సంవత్సరాలలోపు ఉండాలి.
➥ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 02 పోస్టులు
అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ హోదాలో 6 సంవత్సరాలు లేదా జూనియర్ ఇంజినీర్ హోదాలో 10 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. (లేదా) 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ హోదాలో 8 సంవత్సరాలు లేదా జూనియర్ ఇంజినీర్ హోదాలో 12 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలలోపు ఉండాలి.
➥ జూనియర్ ఇంజినీర్ (సివిల్): 03 పోస్టులు
అర్హత: 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.
➥ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 02 పోస్టులు
అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ హోదాలో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి. లేదా జూనియర్ ఇంజినీర్ హోదాలో 10 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. (లేదా) 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ హోదాలో 8 సంవత్సరాలు లేదా జూనియర్ ఇంజినీర్ హోదాలో 12 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలలోపు ఉండాలి.
➥ జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 04 పోస్టులు
అర్హత: 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.
➥ అప్లికేషన్ అనలిస్ట్: 04 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (సైన్స్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బీఈ/బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.03.2023
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
SVNIT Jobs: సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు
CUK Jobs: సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 50 ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు
TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్