IIM Recruitment: విశాఖపట్నం, ఐఐఎంలో ఫ్యాకల్టీ పోస్టులు,అర్హతలివే!
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) వివిధ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తారు.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖపట్నంకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) వివిధ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హత,ఆసక్తి గల అభ్యర్ధులు ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు అక్టోబరు 3 చివరితేదిగా నిర్ణయించారు.
వివరాలు...
* ఫ్యాకల్టీ పోస్టులు
*ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు
విభాగాలు:
• డెసిషన్ సైన్సెస్
• ఇంట్రెప్రెన్యర్‌షిప్
• ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్
• ఆర్గనైజేషన్ బిహేవియర్ & హ్యూమన్ రిసోర్సెస్
• పబ్లిక్ పాలసీ
• ఎకనామిక్స్ & సోషల్ సైన్సెస్
• ఫైనాన్స్ & అకౌంటింగ్
• మార్కెటింగ్
• ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్
• స్ట్రాటజీ
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 55 శాతం మార్కులతో పీహెచ్డీ ఉత్తీర్ణత.
అనుభవం: కనీసం 03-10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.70900-రూ.144200 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఈమెయిల్: facultyrecruit2022sepsrd@iimv.ac.in
హార్డ్ కాపీలను పంపాల్సిన చిరునామా:
THE SENIOR ADMINISTRATIVE OFFICER, INDIAN INSTITUTE OF MANAGEMENT VISAKHAPATNAM,
ANDHRA UNIVERSITY CAMPUS, VISAKHAPATNAM - 530 003, ANDHRA PRADESH, INDIA
దరఖాస్తు చివరి తేది: 03.10.2022.
Notification
Website
Also Read:
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి!
గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) గురువారం (సెప్టెంబరు 8) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. అక్టోబరు 14 వరకు ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేది వివరాలను నమోదుచేసి తమ స్కోరుకార్డు చూసుకోవచ్చు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఈవో పోస్టుల దరఖాస్తు ప్రక్రియ షురూ, మహిళలు మాత్రమే అర్హులు!
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో 181 విస్తరణాధికారుల (సూపర్‌వైజర్) గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 8న ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సరైన అర్హతలు ఉన్న మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 29న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక లింక్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు మొదటగా తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసి మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నిర్దారించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...