IBPS Exam Calendar: బ్యాంక్ ఉద్యోగార్థులకు అలర్ట్! ఈ ఏడాది క్లర్క్, పీవో, ఆఫీసర్ పరీక్షల తేదీలను వెల్లడించిన ఐబీపీఎస్ - ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఈ ఏడాది వివిధ బ్యాంకుల్లో క్లర్క్, పీవో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ పీవో, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్షల క్యాలెండర్‌ను IBPS వెల్లడించింది.
బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది వివిధ బ్యాంకుల్లో క్లర్క్, పీవో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ పీవో, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్షలకు సంబంధించిన 2023-24 పరీక్షల క్యాలెండర్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) జనవరి 16న వెల్లడించింది. దీనిప్రకారం ఐబీపీఎస్ ఈ ఏడాది గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులను; అదేవిధంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయంది.
ప్రకటించిన ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం..
➥ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్(స్కేల్-1), ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 5, 6, 12, 13, 19 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష; సెప్టెంబరు 10, 16 తేదీల్లో మెయిన్ పరీక్షను ఐబీపీఎస్ నిర్వహించనుంది. అదేవిధంగా ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్-2, 3 సింగిల్ పరీక్షను సెప్టెంబరు 10న నిర్వహించనుంది.
➥ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి ఆగస్టు 26, 27; సెప్టెంబరు 2న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబరు 7న మెయిన్ పరీక్ష ఉండనుంది.
➥ ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 23, 30; అక్టోబరు 1న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా నవంబరు 5న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
➥ ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి డిసెంబరు 30, 31 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష, 2024 జనవరి 28న మెయిన్ పరీక్షలను ఐబీపీఎస్ నిర్వహించనుంది.
పరీక్ష పేరు | తేదీలు |
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ | 05.08.2023, 06.08.2023, 12.08.2023, 13.08.2023, 19.08.2023. |
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 2, 3 సింగిల్ ఎగ్జామ్ | 10.09.2023 |
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామ్ | 10.09.2023 |
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ | 16.09.2023 |
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ | 26.08.2023, 27.08.2023, 02.09.2023 |
ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ | 07.10.2023 |
ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ | 23.09.2023, 30.09.2023, 01.10.2023 |
ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ | 05.11.2023 |
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ | 30.12.2023, 31.12.2023 |
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ | 28.01.2024 |
Also Read:
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, 111 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో శాశ్వత ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ హౌజింగ్ బ్యాంకులో 36 మేనేజర్, ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!
న్యూఢిల్లీలోని నేషనల్ హౌజింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో మేనేజర్, ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. జనవరి 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..