IAF Agniveer: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 'అగ్నివీర్ వాయు' ఉద్యోగాలకు నోటిఫికేషన్, అర్హతలు ఇవే
IAF Agniveer: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో అగ్నివీర్ (అగ్నివీర్ వాయు) కొత్త రిక్రూట్‌మెంట్ (01/2024) కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. జులై 27 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
IAF Agniveer: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్(01/2024) విడుదల చేసింది. అర్హత ఉన్నవారు జులై 27వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ agnipathvayu.cdac.in ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష 13 అక్టోబర్ 2023 నుంచి ప్రారంభం అవుతుంది.
అర్హత
A. సైన్స్ సబ్జెక్టులకు: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ ఇంగ్లీష్ లో కనీసం 50 శాతం మార్కులు రావాలి. లేదంటే.. 50 శాతం మార్కులతో 3 సంవత్సరాల ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్ వంటి రెండు నాన్-వొకేషనల్ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో రెండేళ్ల వృత్తి విద్యా కోర్సు చేసి ఉండాలి.
B. సైన్స్ సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టులు
కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో 10+2 చేసి ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లీష్ లో కనీసం 50 శాతం మార్కులు రావాలి.
Also Read: Top Management Institutes: భారత్‌లోని టాప్ 10 మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఇవీ
వయస్సు పరిధి
అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అంటే అభ్యర్థి 27 జూన్ 2003 నుంచి 27 డిసెంబర్ 2006 మధ్య జన్మించి ఉండాలి.
కనీస పొడవు
దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థుల ఎత్తు కనీసం 152.5 సెం.మీ ఉండాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు కనీసం 152 సెం.మీ ఉండాలి.
పురుష అభ్యర్థుల చెస్ట్ కనీసం 77 సెం.మీ ఉండాలి. 5 సెం.మీ వరకు విస్తరించగలగాలి.
ఎంపిక ప్రక్రియ
ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ రిలీజ్ డేట్: 11.07.2023
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 27.07.2023
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు: 17.08.2023
పరీక్ష తేదీ: 13.10.2023
Join Us on Telegram: https://t.me/abpdesamofficial