అన్వేషించండి

HURL Recruitment 2021: డిప్లొమా, డిగ్రీ పాసైన వారికి HURLలో జాబ్స్.. జీతం మూమూలుగా లేదుగా..

HURL Recruitment 2021: హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ 513 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు స్వీకరణ గడువు ఆగస్టు 16తో ముగియనుంది.

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్. హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (HURL) 513 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా అకౌంట్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఇంజనీర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్‌ అసిస్టెంట్, జూనియర్‌ స్టోర్‌ అసిస్టెంట్, ఇంజనీర్‌ అసిస్టెంట్, స్టోర్‌ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది.

దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు ఆగస్టు 16తో ముగియనుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. మిగతా వారు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

విద్యార్హత, వయస్సు..
పోస్టులను బట్టి విద్యార్హత మారుతోంది. డిప్లొమా, డిగ్రీ పాసైన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుక అర్హులు. దూర విద్య, పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా ఉత్తీర్ణలైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు సంబంధిత విభాగాల్లో అనుభవం అవసరం. వయో పరిమితి విషయానికి వస్తే.. పోస్టులను అనుసరించి 25 నుంచి 40ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ట్రేడ్ టెస్ట్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం https://hurl.net.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

భారీగానే జీతం..
ఎంపికైన వారి వేతనం కూడా భారీగానే ఉంటుంది. ఫ్రెషర్స్‌కి ఏడాదికి రూ.3 లక్షల వేతనం చెల్లిస్తారు. ఇక 5 ఏళ్ల అనుభవం ఉన్నవారికి రూ.4,10,000.. 10 ఏళ్ల అనుభవం ఉన్నవారికి రూ.4,90,000 వేతనం చెల్లించనున్నారు. 15 ఏళ్ల అనుభవం ఉన్నవారి వేతనం రూ.5,80,000 ఉంటుంది. 

కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (NTPC), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), కోల్ ఇండియా లిమిటెడ్ (CIL), హిందుస్తాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (HFCL), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL) సంస్థలకు ఈ హెచ్‌యూఆర్‌ఎల్‌ అనుబంధ సంస్థగా ఉంది. 

విభాగాల వారీగా ఖాళీల వివరాలు.. 

  • ఇంజనీర్ అసిస్టెంట్ 1 (అమ్మోనియా)- 45, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 1 (కెమికల్), జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 1 (కెమికల్) విభాగాల్లో 39 చొప్పున పోస్టులు ఉన్నాయి.
  • ఇంజనీర్ అసిస్టెంట్ 1 (మెకానికల్)- 36, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 (మెకానికల్)- 33, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 (అమ్మోనియా), ఇంజనీర్ అసిస్టెంట్ 1 (యూరియా), ఇంజనీర్ అసిస్టెంట్ 1 (ఆఫ్‌సైట్ అండ్ యుటిలిటీస్) విభాగాల్లో 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 
  • జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 (ఇన్‌స్ట్రుమెంటేషన్), ఇంజనీర్ అసిస్టెంట్ 1 (ఇన్‌స్ట్రుమెంటేషన్) విభాగాల్లో 24 చొప్పున, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 1 (మెకానికల్), జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 (ఎలక్ట్రికల్) విభాగాల్లో 21 చొప్పున ఉద్యోగాలు ఉన్నాయి.

Also Read: BEL Recruitment 2021: ఎలాంటి పరీక్షలు లేకుండానే బెల్‌లో ఉద్యోగాలు... రూ.50 వేల వరకు జీతం...

  • జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ 2 (ఎన్విరాన్‌మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్), ఇంజనీర్ అసిస్టెంట్ 1 (ఎలక్ట్రికల్), ల్యాబ్ అసిస్టెంట్ 1 (ఎన్విరాన్‌మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్) విభాగాల్లో 18 చొప్పున ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 
  • జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 1 (ఎలక్ట్రికల్), జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 1 (ఇన్‌స్ట్రుమెంటేషన్), జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 (యూరియా), జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 2 (ఆఫ్‌సైట్ అండ్ యుటిలిటీస్), జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ 1 (యూరియా ప్రొడక్ట్ హ్యాండ్లింగ్), ఇంజనీర్ అసిస్టెంట్ 1 (యూరియా ప్రొడక్ట్ హ్యాండ్లింగ్) విభాగాల్లో 15 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 
  • జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్ 2 (క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ఇన్‌స్పెక్షన్), క్వాలిటీ అసిస్టెంట్ 1 (క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ఇన్‌స్పెక్షన్), జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ 2 (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్), అకౌంట్స్ అసిస్టెంట్ 1 (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్), స్టోర్ అసిస్టెంట్ 1 విభాగాల్లో 6 చొప్పున ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
  • జూనియర్ స్టోర్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్ 2 విభాగాల్లో 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 

Also Read: BSF Recruitment 2021: మీరు టెన్త్ పూర్తి చేసి ఉంటే రూ.69,100 జీతం వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయండిలా

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget