Latest Job Notification : గార్డెన్ రిసెర్చ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌లో 230 అప్రెంటిస్ పోస్టులు
GRSE: గార్డెన్ రిసెర్చ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ అర్హులైన అభ్యర్థుల నుంచి అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్నవారు నవంబరు 17లోగా దరఖాస్తు చేసుకోవాలి.
GARDEN REACH SHIPBUILDERS & ENGINEERS LTD APPRENTICES: కోల్‌కతాలోని 'గార్డెన్ రిసెర్చ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్(GRSE)' ట్రేడ్ అప్రెంటిస్‌షిప్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 230 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కోల్‌కతా, రాంచీలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 17లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అప్రెంటిస్‌గా కొనసాగుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
వివరాలు..
* ట్రేడ్ అప్రెంటిస్‌షిప్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్
ఖాళీల సంఖ్య: 230.
1) ట్రేడ్ అప్రెంటిస్ (Ex-ITI): 90 పోస్టులు
విభాగాలు: ఫిట్టర్, వెల్డర్ (G&E), ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానికల్), ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (PASAA), ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్, మెకానిక్ (డీజిల్), ఫిట్టర్ (స్ట్రక్చరల్), సెక్రటేరియల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్), మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (MMTM), ఇన్ఫర్మేషన్ &కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ (ICTSM), మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్.
అర్హత: అభ్యర్థులు 'ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్' ఉత్తీర్ణులై ఉండాలి. క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) కింద ప్రభుత్వం జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC)ని కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.09.2024 నాటికి 14 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.09.1999 - 01.09.2010 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
2) ట్రేడ్ అప్రెంటిస్ (ఫ్రెషర్): 40 పోస్టులు
విభాగాలు: ఫిట్టర్, వెల్డర్ (G&E), ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్.
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐటీఐ ఉత్తీర్ణులైనవారు లేదా ఐటీఐ పరీక్షకు హాజరైనవారు ట్రేడ్ అప్రెంటిస్ (ఫ్రెషర్) పోస్టులకు అనర్హులు.
వయోపరిమితి: 01.09.2024 నాటికి 14 - 20 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.09.2004 - 01.09.2010 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
3) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 40 పోస్టులు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ & ఐటీ, సివిల్.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. 2022 - 2024 మధ్య ఉత్తీర్ణులైనవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. అప్రెంటిస్ శిక్షణలో ఉన్నవారు అనర్హులు. పీజీ డిగ్రీ చేసినవారు అనర్హులు.
వయోపరిమితి: 01.09.2024 నాటికి 14 - 26 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.09.1998 - 01.09.2010 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
4) టెక్నీషియన్ అప్రెంటిస్: 60 పోస్టులు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి. బీఈ, బీటెక్ విద్యార్థులు, అప్రెంటిస్ శిక్షణలో ఉన్నవారు అనర్హులు.
వయోపరిమితి: 01.09.2024 నాటికి 14 - 26 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.09.1998 - 01.09.2010 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా.
స్టైపెండ్: నెలకు ట్రేడ్ అప్రెంటిస్‌లకు (ఫ్రెషర్) మొదటి ఏడాది - రూ.6,000; రెండో ఏడాది రూ.6,600; ట్రేడ్ అప్రెంటిస్‌లకు(ఐటీఐ) మొదటి ఏడాది రూ.7,000; రెండో ఏడాది రూ.7, 7000; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.15,000 (కోల్‌కతా)- రూ.12,500 (రాంచీ); టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.10,000(కోల్‌కతా)- రూ.9,000(రాంచీ).
శిక్షణ ప్రదేశాలు: కోల్‌కతా, రాంచీ.
దరఖాస్తుకు చివరితేదీ: 17.11.2024.
Apprentice WebsiteApprentice Website
ALSO READ: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులు