అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

SI Exams: నేటి నుంచి ఎస్‌ఐ తుది పరీక్షలు, నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ - ఈ రూల్స్ పాటించాల్సిందే!

ఏపీలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 14, 15 తేదీల్లో తుది పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 14, 15 తేదీల్లో తుది పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అక్టోబరు 6న పోలీసు నియామక బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబరు 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఇక అక్టోబరు 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-3 పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 పరీక్ష నిర్వహిస్తారు.

🔰 మెయిన్ పరీక్ష విధానం: 

➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

➨  సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

➨  ఏపీఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

➨ ఎస్‌ఐ తుది పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 ఇంగ్లిష్ (డిస్క్రిప్టివ్), పేపర్-2 తెలుగు/ఉర్దూ (డిస్క్రిప్టివ్), పేపర్-2 అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్), పేపర్-4 జనరల్ స్టడీస్(ఆబ్జెక్టివ్) ఉంటాయి. వీటిలో పేపర్-1, పేపర్-2 కేవలం అర్హత పరీక్షలు మాత్రమే.

ఏ కేంద్రంలో ఎంత మంది?

ఫిజికల్ ఈవెంట్లలో మొత్తం 31,193 మంది అభ్యర్థులు సాధించారు. వీరిలో పురుషులు-27,590 మంది, స్త్రీలు-3603 మంది పరీక్షకు హాజరుకానున్నారు. వీరికి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 

➥ విశాఖపట్నం కేంద్రంలో మొత్తం 11,365 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-9913, స్త్రీలు-1452 మంది పరీక్షలు రాయనున్నారు.

➥ ఏలూరు కేంద్రంలో మొత్తం 4162 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-3649, స్త్రీలు-513 మంది పరీక్షలు రాయనున్నారు.

➥ గుంటూరు కేంద్రంలో మొత్తం 7145 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-6384, స్త్రీలు-761 మంది పరీక్షలు రాయనున్నారు.

➥ కర్నూలు కేంద్రంలో మొత్తం 8521 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-7644, స్త్రీలు-877 మంది పరీక్షలు రాయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 57,923 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన 31,193 మంది అభ్యర్థులకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎస్‌ఐ పోస్టుల నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అభ్యర్థులు ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. 

➥ నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి అనుమతించరు. కాబట్టి గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా చూసుకోవాలి. 

➥ అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్ కార్డు వంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాల్సి ఉంటుంది.

➥ అభ్యర్థులు మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్‌వాచ్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, పర్సు, నోట్సు, ఛార్టులు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. 

➥ మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదు. విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో క్లోక్‌రూం సదుపాయం ఉండదు. 

➥ అభ్యర్థులు చేతులకు మెహిందీ, టాటూలు ఉంచుకోవద్దు.  

➥ అభ్యర్థి పరీక్ష గదిలోకి హాల్‌టికెట్‌తో పాటు బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నును మాత్రమే తీసుకెళ్లాలి.

➥ ఓఎంఆర్‌ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు వంటివి రాస్తే మాల్‌ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.

➥ పరీక్షపత్రం బుక్‌లెట్‌లో ఇంగ్లిష్‌-తెలుగు, ఇంగ్లిష్‌-ఉర్దూ భాషలలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలుంటే ఇంగ్లిష్‌ వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలి.

ALSO READ

ఆ అభ్యర్థులకు మళ్లీ ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించండి, పోలీసు నియామక మండలికి హైకోర్టు ఆదేశం
ఎస్‌ఐ ఉద్యోగాలకు నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్లలో అనర్హత పొందిన అభ్యర్థులందరికీ మరోసారి దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించి, ఎలక్ట్రానిక్ యంత్రంతో కాకుండా మాన్యువల్‌గా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థినీ అనుమతించాలని స్పష్టం చేసింది. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి సమాచారం ఇచ్చి.. ఈ ప్రక్రియ మొత్తం 3 రోజులలోపు పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Jayamangala Venkataramana : వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
వైసీపీకి మరో షాక్ - పార్టీకి, పదవికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా !
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
Embed widget