TS TET: టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, హర్షం వ్యక్తం చేసిన హరీశ్‌రావు
రాష్ట్రంలో డీఎస్సీ-2024 కంటే ముందే 'టీఎస్ టెట్' నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వేరకు విద్యాశాఖ మార్చి 14న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Harish Rao: రాష్ట్రంలో డీఎస్సీ-2024 కంటే ముందే 'టీఎస్ టెట్' నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వేరకు విద్యాశాఖ మార్చి 14న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. టెట్ నిర్వహించకుండా డీఎస్సీ నిర్వహించడం వల్ల రాష్ట్రంలోని 7 లక్షలకు పైగా విద్యార్థులు అర్హత కోల్పోతున్నారని అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ.. టెట్ నిర్వహించాలని మార్చి 12న బీఆర్‌ఎస్ పార్టీ తరఫున తాను లేఖ రాశామని తెలిపారు. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడమం సంతోషకరమని అన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు.
— Harish Rao Thanneeru (@BRSHarish) March 14, 2024
టెట్ నిర్వహణ జరగకపోవడం వల్ల రాష్ట్రంలో 7 లక్షల పై చిలుకు విద్యార్థులు డీఎస్సీ పరీక్షకు అర్హత కోల్పోతున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ, టెట్ నిర్వహించాలని ఈనెల 12న… pic.twitter.com/wtDrlGNsJ4
టెట్ నిర్వహణపై హరీశ్‌రావు లేఖ..
ఇదే విషయమై మాజీ మంత్రి హరీశ్‌రావు.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ కూడా రాశారు. టెట్ నిర్వహించక పోవడం వల్ల ప్రస్తుతం విడుదలైన డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హతను అనేకమంది కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుడు సెప్టెంబర్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెట్ నిర్వహించలేదని పేర్కొన్నారు. గత డిసెంబర్‌లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు దాదాపు 50 వేల మంది ఉన్నారని వివరించారు. టెట్ నిర్వహిస్తే ఇందులో అర్హత సాధించిన వారందరూ డీఎస్సీ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. డీఈడీ, బీఈడీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
ALSO READ;
తెలంగాణ డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC)-2024 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు డీఎస్సీ పరీక్ష తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మరోవైపు డీఎస్సీ పరీక్షల కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్దిసేపట్లోనే నోటిఫికేషన్ విడుదల కావడం విశేషం. డీఎస్సీ కంటే ముందుగానే టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..