ESIC: ఈఎస్ఐసీ ఉద్యోగమండల్‌లో 45 సూపర్ స్పెషలిస్ట్ అండ్ సీనియర్ రెసిడెంట్ పోస్టులు, వివరాలు ఇలా
Telugu News: కేరళ ఎర్నాకులం, ఉద్యోగమండల్‌లోని ఈఎస్ఐసీ హాస్పిటల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సూపర్ స్పెషలిస్ట్, స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేరళ ఎర్నాకులం, ఉద్యోగమండల్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) హాస్పిటల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సూపర్ స్పెషలిస్ట్, స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 45 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 6న ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 45.
1. సూపర్ స్పెషలిస్ట్ (ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్): 01 పోస్టు
విభాగం: కార్డియాలజీ- 01.
అర్హత: ఎంబీబీఎస్, ఎండీ, డీఎం/డీఎన్‌బీ(కార్డియాలజీ).
అనుభవం: ఎఫ్‌టీఎస్‌ఎస్(ఎంట్రీలెవెల్)- నిల్. ఎఫ్‌టీఎస్‌ఎస్(సీనియర్ లెవెల్)- సంబంధిత స్పెషాలిటీలో 5 సంవత్సరాలు ఉండాలి.
వయోపరిమితి: 06.06.2024 నాటికి ఫుల్ టైమ్ సూపర్ స్పెషలిస్ట్- 45 సంవత్సరాలు మించకూడదు. పార్ట్‌టైమ్ సూపర్ స్పెషలిస్ట్- 69 సంవత్సరాలు మించకూడదు.
జీతం: ఎఫ్‌టీఎస్‌ఎస్(ఎంట్రీలెవెల్)- రూ.200000. ఎఫ్‌టీఎస్‌ఎస్(సీనియర్ లెవెల్)- రూ.240000. పీటీఎస్‌ఎస్(ఎంట్రీలెవెల్)- రూ.100000. పీటీఎస్‌ఎస్(సీనియర్ లెవెల్)- రూ.150000.
2. స్పెషలిస్ట్ (ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్): 10 పోస్టులు
విభాగాలు..
➥ జనరల్ మెడిసిన్- 02 పోస్టులు
➥ పాథాలజీ- 01 పోస్టు
➥ రేడియాలజీ- 01 పోస్టు
➥ అనస్థీషియా- 01 పోస్టు
➥ ఐసీయూ- 01 పోస్టు
➥ క్యాజువాల్టీ- 01 పోస్టు
➥ సైకియాట్రీ- 01 పోస్టు
➥ సర్జరీ- 01 పోస్టు
➥ ఓబీజీ- 01 పోస్టు
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
అనుభవం: ఎఫ్‌టీఎస్‌ఎస్(ఎంట్రీలెవెల్) & పీటీఎస్- సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీతో 3 సంవత్సరాల అనుభవం లేదా పీజీ డిప్లొమాతో 5 సంవత్సరాల అనుభవం. ఎఫ్‌టీఎస్‌ఎస్(సీనియర్ లెవెల్)- సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీతో 5 సంవత్సరాల అనుభవం లేదా పీజీ డిప్లొమాతో 7 సంవత్సరాల అనుభవంఉండాలి.
వయోపరిమితి: 06.06.2024 నాటికి ఫుల్ టైమ్ సూపర్ స్పెషలిస్ట్- 45 సంవత్సరాలు మించకూడదు. పార్ట్‌టైమ్ సూపర్ స్పెషలిస్ట్- 69 సంవత్సరాలు మించకూడదు.
జీతం: ఎఫ్‌టీఎస్‌ఎస్(ఎంట్రీలెవెల్)- రూ.144846. ఎఫ్‌టీఎస్‌ఎస్(సీనియర్ లెవెల్)- రూ.166824. పీటీఎస్‌ఎస్- రూ.60000.
3. సీనియర్ రెసిడెంట్ (3 సంవత్సరాలు): 05 పోస్టులు
విభాగాలు..
➥ జనరల్ సర్జరీ- 01 పోస్టు
➥ ఓబీజీ- 01 పోస్టు
➥ జనరల్ మెడిసిన్- 01 పోస్టు
➥ ఆర్థోపెడిక్స్- 01 పోస్టు
➥ అనస్థీషియా- 01 పోస్టు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 06.06.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.144846.
4. సీనియర్ రెసిడెంట్ (1 సంవత్సరం): 29 పోస్టులు
విభాగాలు..
➥ ఓబీజీ- 05 పోస్టులు
➥ అనస్థీషియా- 04 పోస్టులు
➥ ఐసీయూ- 04 పోస్టులు
➥ పిడియాట్రిక్స్- 04 పోస్టులు
➥ సర్జరీ- 03 పోస్టులు
➥ జనరల్ మెడిసిన్- 02 పోస్టులు
➥ ఆర్థోపెడిక్స్- 03 పోస్టులు
➥ క్యాజువాల్టీ- 04 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 06.06.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: పీజీ డిగ్రీ హోల్డర్లకు రూ.144846. పీజీ డిప్లొమా హోల్డర్లకు రూ.143496. ఎంబీబీఎస్- రూ.142596.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.250. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50. దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 06.06.2024.
వేదిక: ESIC Hospital, Udyogamandal, Ernakulam District, Kerala.