EPIL Jobs: ఈపీఐఎల్‌లో మేనేజర్ ఉద్యోగాలు, దరఖాస్తుచేసుకోండి!
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్(ఈపీఐఎల్) మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబరు 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 11
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్
1) అసిస్టెంట్ మేనేజర్
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.
పని అనుభవం: కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
2) మేనేజర్
అర్హత: బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ ఉత్తీర్ణత ఉండాలి.
పని అనుభవం: కనీసం 4 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 29.11.2022.
::Also Read::
డీఆర్‌డీవో ఉద్యోగాలకు ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, చివరితేది ఎప్పుడంటే?
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనేజేషన్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్ష 'కీ' విడుదల, అందుబాటులో రెస్పాన్స్ షీట్లూ!
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నవంబరు 15న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ ద్వారా తమ సమాధానాలు సరిచూసుకోవచ్చు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, టీఎస్పీఎస్సీ ఐడీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్స్, ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు.
ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ కోసం క్లిక్ చేయండి...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!
తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి 50 వేలకు పైగా పోస్టులకు ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించింది. ఆయా పోస్టులకు నవంబరు 20 తర్వాత వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, లెక్చరర్ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు, అటవీశాఖ ఉద్యోగాలు, గురుకుల టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టనుంది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..