Anganwadi Posts: ఇంటర్ ఉంటేనే 'అంగన్‌వాడీ' ఉద్యోగం, త్వరలో 5 వేలకు పైగా పోస్టుల భర్తీ!
అంగన్‌వాడీ టీచర్, వర్కర్ పోస్టులకు విద్యార్హతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పదోతరగతి అర్హతగా ఈ ఉద్యోగాలకు, ఇకపై ఇంటర్మీడియట్‌ను అర్హతగా నిర్ణయించింది.
అంగన్‌వాడీ టీచర్, వర్కర్ పోస్టులకు విద్యార్హతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పదోతరగతి అర్హతగా ఈ ఉద్యోగాలకు, ఇకపై ఇంటర్మీడియట్‌ను అర్హతగా నిర్ణయించింది. ఈమేరకు మిషన్ సాక్షం అంగన్‌వాడీ, పోషణ్ అభియాన్ 2.0 విధివిధానాలను కేంద్రం జారీ చేసింది. ఇందులో భాగంగా ఏడాదికి 40వేల చొప్పున అయిదేళ్లలో రెండు లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించనుంది. అదేవిధంగా ఇకపై అంగన్‌వాడీ నియామకాల్లో కనీస వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడంతో పాటు గరిష్ఠ వయసు 35 ఏళ్లుగా నిర్ణయించింది.
కొత్త విధివిధానాలతో రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 5,111 టీచర్, ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ పోస్టుల్లో పనిచేసే సిబ్బందిని గౌరవ వేతన వర్కర్లుగా స్పష్టంచేసింది. అంగన్‌వాడీ సర్వీసుల్లో చేరిన మహిళలకు పదవీ విరమణ వయసు ఖరారు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చని తెలిపింది. అయితే 65 ఏళ్ల తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వీసులో ఉండకూడదని కేంద్రం స్పష్టం చేసింది.
అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా చేపట్టబోయే నియామకాల్లో 50 శాతం అంగన్‌వాడీ టీచర్ పోస్టులను అయిదేళ్ల అనుభవం కలిగి, ఆయాలుగా పనిచేస్తున్న వారితో భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్ వైజర్ పోస్టుల్లో 50 శాతం పోస్టులను అయిదేళ్ల సర్వీసు ఉన్న అంగన్‌వాడీ టీచర్లతో భర్తీచేయాలి. ఈ పోస్టులకు నిర్ణయించిన విద్యార్హతలు, సర్వీసు నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలి. అంగన్‌వాడీ సూపర్ వైజర్, టీచర్, ఆయా పోస్టుల భర్తీలో రిజర్వేషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
Also Read:
CLAT 2023: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2023, దరఖాస్తు చేసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) - 2023' ప్రవేశ ప్రకటన విడుదలైంది. దీనిద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతోపాటు, ఏడాది కాలపరిమితి ఉండే పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. క్లాట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆగస్టు 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 18న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2023 వివరాల కోసం క్లిక్ చేయండి
MAT 2022 Notification: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2022 సెప్టెంబర్ సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 సెప్టెంబరుకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.
మ్యాట్ - సెప్టెంబరు 2022 సెషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..