(Source: ECI/ABP News/ABP Majha)
ECIL Walkin: ఈసీఐఎల్‌లో 190 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు! వాక్‌ఇన్ షెడ్యూలు ఇదే!
బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 26, 28, 29 తేదీల్లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 26,28,29 తేదీల్లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. అర్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ క్యాంపస్‌లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు.
వివరాలు...
* టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 190
కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది. అవసరాలకు అనుగుణంగా పొడిగించే అవకాశం ఉంది.
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్(ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & టెలి-కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: డిజిటల్ ఆసిలోస్కోప్ ఆపరేషన్, ఎలక్ట్రానిక్స్ మెజరింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్ట్ రికార్డింగ్ విభాగాల్లో కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.10.2022 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి.నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. వాక్‌ఇన్ తేదీరోజు ఉదయం 11.30 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
పని ప్రదేశం: ఎంపికైనవారు హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో పనిచేయాల్సి ఉంటుంది..
జీతభత్యాలు: నెలకు రూ.25,000 నుంచి రూ.31,000 వరకు చెల్లిస్తారు.
వాక్‌ఇన్ తేది: నవంబరు 26, 28, 29 తేదీల్లో.
వాక్‌ఇన్ సమయం: ఉదయం 9:30 నుంచి.
వాక్‌ఇన్ వేదిక:
Factory Main Gate,
Electronics Corporation of India Limited,
ECIL Post, Hyderabad -500062.
Also Read:
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 800 ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులు
న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) ఆర్డీ సెక్టార్ రీఫార్మ్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి...
వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 2521 అప్రెంటీస్ ఖాళీలు - టెన్త్‌తోపాటు ఐటీఐ అర్హత ఉండాలి!
RRC-West Central Railway Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- వెస్ట్ సెంట్రల్ రైల్వే 2022-23 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధింత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులను మెరిట్ (పదోతరగతి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులకు మోదీ గుడ్ న్యూస్, నైపుణ్యాభివృద్ధికి 'కర్మయోగీ భారత్'! రోజ్ గార్ మేళాలో ప్రకటించిన ప్రధాని, 71 వేల మందికి నియామక పత్రాలు
రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన మరో 71 వేల మందికి మంగళవారం (నవంబరు 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందించారు. ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా కొత్తగా ఉద్యోగాలు పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. నియామక పత్రాలను ఎన్నికల నియమావళి అమలులో ఉన్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ నహా మిగిలిన రాష్ట్రాల్లోని 45 ప్రాంతాల్లో అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబరు 22న 75వేల మందికి నియామకపత్రాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండో విడత నియామక పత్రాలు అందజేశారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..