DPSDAE: అణుశక్తి విభాగంలో 65 జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ముంబయితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్ యూనిట్లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముంబయిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ముంబయితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్ యూనిట్లలో జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 22 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
* జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్
మొత్తం ఖాళీలు: 65.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమా(మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తుదారు ఫీజు: రూ.200. ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు: నెలకు రూ.25500-రూ.81100.
ముఖ్య తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.04.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.05.2023.
➥ ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షల తేదీలు: జూన్ రెండో వారం.
Also Read:
CIPET: సీపెట్‌లో 38 సూపర్‌వైజరీ & నాన్-సూపర్‌వైజరీ పోస్టులు
చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్స్ దేశవ్యాప్తంగా సీపెట్ కేంద్రాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 38 సూపర్‌వైజరీ, నాన్-సూపర్‌వైజరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 29 వరకు ఆఫ్‌లైన్ విధానంలో సంబంధిత చిరునామాకు దరఖాస్తులు పంపాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిమ్స్‌లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్)- 4 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మే 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్ / ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..