News
News
వీడియోలు ఆటలు
X

AIIMS NORCET: ఎయిమ్స్‌లో 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!

న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

FOLLOW US: 
Share:

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్‌)- 4 నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మే 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.  స్టేట్ / ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.

ఖాళీల వివరాలు..

నర్సింగ్ ఆఫీసర్: 3,055 పోస్టులు

సంస్థల వారీగా ఖాళీల వివరాలు..

➥ ఎయిమ్స్‌ భటిండా- 142

➥ ఎయిమ్స్‌ భోపాల్- 51

➥ ఎయిమ్స్‌ భువనేశ్వర్- 169

➥ ఎయిమ్స్‌ బీబీనగర్- 150

➥ ఎయిమ్స్‌ బిలాస్‌పూర్- 178

➥ ఎయిమ్స్‌ దేవ్‌ఘర్- 100

➥ ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్- 121

➥ ఎయిమ్స్‌ జోధ్‌పూర్- 300

➥ ఎయిమ్స్‌ కల్యాణి- 24

➥ ఎయిమ్స్‌ మంగళగిరి- 117

➥ ఎయిమ్స్‌ నాగ్‌పుర్- 87

➥ ఎయిమ్స్‌ రాయ్ బరేలీ- 77

➥ ఎయిమ్స్‌ న్యూఢిల్లీ- 620

➥ ఎయిమ్స్‌ పట్నా- 200

➥ ఎయిమ్స్‌ రాయ్‌పూర్- 150

➥ ఎయిమ్స్‌ రాజ్‌కోట్- 100

➥ ఎయిమ్స్‌ రిషికేశ్- 289

➥ ఎయిమ్స్‌ విజయ్‌పూర్- 180

అర్హత: డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.  స్టేట్ / ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.

వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 5 సంవత్సరాలపాటు వయో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: నార్‌సెట్‌-4 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీత భత్యాలు: రూ.9300- రూ.34800తో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది.

పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి 3 గంటలు. ఆబ్జెక్టివ్‌ విధానంలో 200 ప్రశ్నలు, 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. సబ్జెక్టుకు సంబంధించి 180 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 12.04.2023 నుంచి 05.05.2023 వరకు.

➥ దరఖాస్తు సవరణ తేదీలు: 06.05.2023 నుంచి 08.05.2023 వరకు.

➥ సీబీటీ పరీక్ష తేదీ: 03.06.2023.

Notification

Online Application

Website

                                         

Also Read:

హైదరాబాద్‌ నిప్ట్‌‌లో గ్రూప్-సి పోస్టులు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) శాశ్వత ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..  

ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెగ్యులర్ ప్రాతిపదికన స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హతతోపాటు, టైపింగ్ తెలిసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఏప్రిల్ 26 మధ్య ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ (టైపింగ్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో నియమిస్తారు. ఎంపిక విధానంలో తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

Published at : 13 Apr 2023 07:57 PM (IST) Tags: AIIMS Notification AIIMS Recruitment AIIMS Jobs AIIMS New Delhi Recruitment

సంబంధిత కథనాలు

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!

WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!

WCDSCD Yadadri Bhuvanagiri District: యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, వివరాలు ఇలా!

WCDSCD Yadadri Bhuvanagiri District: యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, వివరాలు ఇలా!

Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?

Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?

WDCWD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!

WDCWD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్