Medical Colleges Recruitment: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 4,356 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, వాక్-ఇన్ ఎప్పుడంటే?
తెలంగాణలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో బోధన సిబ్బంది కొరతను తీర్చేందుకు మార్చి 14న నోటిఫికేషన్‌ను వైద్యవిద్యామండలి విడుదల చేసింది.
Director of Medical Education Recruitment: తెలంగాణలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో బోధన సిబ్బంది కొరతను తీర్చేందుకు 4,356 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్, ట్యూటర్లను నియమించుకునేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,459, ట్యూటర్లు 412, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 1,201 ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు.
పోస్టుల భర్తీకి సంబంధించిన మార్చి 14న నోటిఫికేషన్‌ను వైద్యవిద్యామండలి విడుదల చేసింది. ఆసక్తి, సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 16న ఆయా మెడికల్ కాలేజీల్లో నిర్వహించే వాక్‌ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను వాక్‌ఇన్ సమయంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు నోట్ విడుదల చేసింది.
నోట్‌లోని వివరాలు ఇలా..
Note: The original certificates MBBS, MD/MS/DNB degree along with MBBS registration and MS/MD/DNB Degree/Specialty degree registration, experience certificate and publication have to be produced at the time of Joining. Incomplete applications will be rejected. |
గాంధీ ఆసుపత్రిలో 121 పోస్టులు..
గాంధీ మెడికల్ కాలేజీ, ఆసుపత్రుల్లో 121 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో.. కళాశాల యాజమాన్యం ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గాంధీ ఆసుపత్రిలో కొత్తగా ఎంసీహెచ్ ప్రత్యేక ఆసుపత్రి రావడం అందులో గైనకాలజీ, పీడియాట్రిక్ సహా వాటికి సంబంధించిన విభాగాలు ఏర్పడిన నేపథ్యంలో అదనపు సిబ్బంది అవసరమైంది. మొత్తం 22 విభాగాలకు గాను మూడు విభాగాలకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 73, ట్యూటర్లు 8, సీనియర్ రెసిడెంట్లు 37 మందిని కాంట్రాక్టు, గౌరవవేతనం చెల్లించే పద్ధతిలో నియమించనున్నారు. వచ్చే ఏడాది మార్చి31 వరకు ఏడాదిపాటు విధులు నిర్వహించేలా అర్హులైన వారిని మార్చి 16న ఇంటర్వ్యూల ద్వారా నియమించాలని యంత్రాంగం నిర్ణయించింది. అర్హులు గాంధీ మెడికల్ కాలేజీలోని ప్రిన్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పోస్టుల వివరాలు...
1) ప్రొఫెసర్
2) అసోసియేట్ ప్రొఫెసర్
3) అసిస్టెంట్ ప్రొఫెసర్
4) సీనియర్ రెసిడెంట్
5) ట్యూటర్
కళాశాలలవారీగా ఖాళీల వివరాలు..
అర్హతలు..
➥ ప్రొఫెసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ అర్హత ఉండాలి. దీంతోపాటు 8 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కనీసం 3 సంవతప్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
➥ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ అర్హత ఉండాలి. దీంతోపాటు 5 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కనీసం 4 సంవతప్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ అర్హత ఉండాలి. సీనియర్ రెసిడెంట్‌గా ఏడాది అనుభవం ఉండాలి.
➥ సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ అర్హత ఉండాలి.
➥ ట్యూటర్ పోస్టులకు ఎంబీబీఎస్ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 31.03.2024 నాటికి 69 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా.
విభాగాలు: అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ & వెనరాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ, రేడియాలజీ, అనస్తీషియా, సూపర్ స్పెషాలిటీ.
జీతం: ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,90,000; అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,50,000; అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,25,000; సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నెలకు రూ.92,575; ట్యూటర్ పోస్టులకు నెలకు రూ.55,000 ఇస్తారు.
Notification & Application: