DAWD: గుంటూరు జిల్లాలో 49 బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
పోస్టును అనుసరించి స్థానిక భాష చదవడం, రాయడంతో పాటు 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఎంపీహెచ్ఏ, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు.
AP: వికలాంగుల సంక్షేమ శాఖ, ఉమ్మడి గుంటూరు జిల్లా పలు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి విభిన్న ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 49 బ్యాక్‌లాగ్ పోస్టులను వివిధ శాఖలలో భర్తీచేయనున్నారు. పోస్టును అనుసరించి స్థానిక భాష చదవడం, రాయడంతో పాటు 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఎంపీహెచ్ఏ, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబరు 22 నుంచి డిసెంబరు 06 వరకు కొనసాగుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు దరఖాస్తులతో పాటు సంబందిత నిర్ణిత ధృవ పత్రములను డిసెంబరు 06 సా.5లోపు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవలెను.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 49
1. జూనియర్ అసిస్టెంట్: 06 పోస్టులు
2. జూనియర్ ఆడిటర్: 01 పోస్టు
3. టైపిస్ట్: 02 పోస్టులు
4. టైపిస్ట్/ స్టెనో: 01 పోస్టు
5. జూనియర్ స్టెనోగ్రాఫర్: 01 పోస్టు
6. వెటర్నరీ అసిస్టెంట్: 01 పోస్టు
7. ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 01 పోస్టు
8. ఎంపీహెచ్ఏ: 01 పోస్టు
9. హెల్త్ అసిస్టెంట్: 01 పోస్టు
10. మెటర్నిటీ అసిస్టెంట్: 01 పోస్టు
11. బోర్‌వెల్ ఆపరేటర్: 01 పోస్టు
12. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-3: 09 పోస్టులు
13. షరాఫ్: 01 పోస్టు
14. ఆఫీస్ సబార్డినేట్: 07 పోస్టులు
15. వాచ్‌మెన్ కమ్ హెల్పర్: 01 పోస్టు
16. వాచ్‌మెన్: 03 పోస్టులు
17. నైట్ వాచ్‌మెన్: 02 పోస్టులు
18. బంగ్లా వాచర్: 01 పోస్టు
19. కుక్: 01 పోస్టు
20. కమాటి: 02 పోస్టులు
21స్కావెంజర్: 01 పోస్టు
22. స్వీపర్: 01 పోస్టు
23. పీహెచ్ వర్కర్: 01 పోస్టు
24. యుటెన్సిల్ క్లీనర్: 01 పోస్టు
25. బేరర్: 01 పోస్టు
అర్హత: పోస్టును అనుసరించి స్థానిక భాష చదవడం, రాయడం, 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఎంపీహెచ్ఏ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 నుంచి 52 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: నిబంధనల ప్రకారం ఎంపికలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 22.11.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.12.2022.
Also Read:
ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నోయిడా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా డిప్యూటీ డైరెక్టర్, EDP అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఇంటర్, సంబధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో స్పీడ్‌గా టైప్ చేయకలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 12 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ప్రకాశం జిల్లాలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్ అర్బన్ క్లినిక్/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదోతరగతి, ఎంబీబీఎస్, డీఫార్మసీ/ బీఫార్మసీ, డిప్లొమా, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణిత దరఖాస్తులను నింపి సంబధిత ధృవ పత్రాలను జతపరిచి వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, జీజీహెచ్ కాంపౌండ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాలో అందచేయాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..