News
News
X

CTET Answer Key: సీటెట్‌ 2022 ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం!

సీబీఎస్ఈ నిర్వహించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) - డిసెంబర్ 2022  ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఫిబ్రవరి 14న విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు.

FOLLOW US: 
Share:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) - డిసెంబర్ 2022  ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఫిబ్రవరి 14న విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. సీటెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి కీని చూసుకోవచ్చు.  ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. కీపై అభ్యంతరాలు ఉంటే ప్రశ్నకు రూ.1000 రుసుము చొప్పున ఫిబ్రవరి 17లోగా నిర్ణీత నమూనా ప్రకారం తెలియజేయాల్సి ఉంటుంది.

కంప్యూటర్ ఆధారిత (ఆన్‌లైన్) విధానంలో ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో గత డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరిగిన విషయం తెలిసిందే. సీటెట్ పరీక్ష కోసం 32.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు అధికారులు అంచనావేస్తున్నారు. మొత్తం 74 నగరాల్లోని 243 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 20 భాషల్లో సీటెట్ పరీక్ష నిర్వహించారు. 

ఆన్సర్ కీ ఇలా చెక్ చేసుకోండి..

స్టెప్-1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. - https://ctet.nic.in/

స్టెప్-2: అక్కడ హోంపేజీలో ఆక్టివిటీ అనే ఆప్షన్‌లో లాగిన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్-3:  అక్కడ కనిపించే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి.

స్టెప్-4:  తర్వాత సైన్ ఇన్ పై క్లిక్ చేసి.. ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

స్టెప్-5:  మెయిన్ వెబ్‌సైట్‌లో స్క్రీన్ పై కనిపిస్తున్న ప్రాథమిక కీ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

స్టెప్-6:  ఆన్సర్ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లింక్ ద్వారా తెలియజేయాలి. 

సీటెట్ డిసెంబరు 2022 ప్రిలిమినరీ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు క్లిక్ చేయండి..

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్) - 2022' నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అక్టోబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఈ పరీక్షను ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. సీటెట్‌ స్కోరుకు లైఫ్‌ లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావొచ్చు.

సీటెట్‌ స్కోరు ఉన్న వారు ఆయా రాష్ట్రాలు నిర్వహించే టెట్‌(టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ను విధిగా రాయాల్సిన అవసరం లేదు. సీటెట్‌ స్కోరుతో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, కేంద్ర స్థాయి విద్యా సంస్థల్లో అంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

Also Read:

యూజీసీ నెట్‌-2022 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్! పరీక్షల షెడ్యూలు ఇలా!
యూజీసీ నెట్‌-2022 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్-2022 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు పరీక్ష సెంటర్ వివరాలకు సంబంధించిన స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే పరీక్ష అడ్మిట్ కార్డులను కూడా ఎన్టీఏ త్వరలోనే విడుదల చేయనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 15 Feb 2023 07:46 AM (IST) Tags: CTET December 2022 Answer Key CTET Answer Key December 2022 CTET Answer Key 2022 CTET 2022 Answer Key CBSE CTET Answer Key 2022 CBSE CTET 2022 Answer Key

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!

EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!

రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు

రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు

SSC MTS Final Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 2021 తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 7494 మంది ఎంపిక!

SSC MTS Final Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 2021 తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 7494 మంది ఎంపిక!

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం