CCIL: ఆదిలాబాద్ కాటన్ కార్పొరేషన్‌లో ఫీల్డ్, ఆఫీస్ స్టాఫ్ పోస్టులు - అర్హతలివే
ఆదిలాబాద్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఆదిలాబాద్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవసరానికి అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నారు. పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
➥ ఫీల్డ్ స్టాఫ్
➥ ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్)
➥ ఆఫీస్ స్టాఫ్ (జనరల్)
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
వేతనం: ఆఫీస్ స్టాఫ్ పోస్టులకు నెలకు రూ.24,000, ఫీల్డ్ స్టాఫ్ పోస్టులకు రూ.36,000 చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ:
➥ ఆఫీస్ స్టాఫ్ (జనరల్): 28.10.2023.
➥ ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్): 29.10.2023.
➥ ఫీల్డ్ స్టాఫ్: 30.10.2023.
వాక్-ఇన్ వేదిక:
The Cotton Corporation of India Ltd.
Branch Office: Adilabad
Mangalmurti Tower, 1st Floor,
Cinema Road, Adilabad-504 001.
ALSO READ:
గుంటూరు- కాటన్ కార్పొరేషన్‌లో ఫీల్డ్ ఆఫీస్ స్టాఫ్ పోస్టులు
గుంటూరులోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ఫీల్డ్ ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. నవంబరు 2,3 వ తేదీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ- రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిగ్రీతోపాటు న్యూస్ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..