ఏపీలో 1,010 ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్! పోస్టులు ఇవే!
హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలని, ఖాళీగా ఉన్న 1010 వెల్ఫేర్ ఆఫీసర్స్, ట్రైబల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, కేర్ టేకర్లు కలిపి మొత్తం పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.
ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1010 వెల్ఫేర్ ఆఫీసర్స్, కేర్ టేకర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్ల పై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నవంబరు 18న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు మంచి సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని సీఎం సూచించారు.
హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలని, ఖాళీగా ఉన్న759 మంది వెల్ఫేర్ ఆఫీసర్స్, 171 మంది ట్రైబల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, 80 మంది కేర్ టేకర్లు కలిపి మొత్తం 1010 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్–4 ఉద్యోగుల నియామకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి హాస్టల్‌ను పరిశీలించి కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలన్నారు. పిల్లలకు నాణ్యమైన వస్తువులను అందించాలన్నారు.. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్–4 ఉద్యోగుల నియామకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలని,మండలాలవారీగా పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతి హాస్టల్‌ను పరిశీలించి కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలని సీఎం జగన్ సూచించారు.
పోస్టుల వివరాలు...
సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ - 759 పోస్టులు
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ - 171 పోస్టులు
కేర్ టేకర్లు - 80 పోస్టులు
Also Read:
వైఎస్‌ఆర్ జిల్లాలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు, అర్హతలివే!
వైఎస్ఆర్ జిల్లా కడప, ప్రొద్దుటూరులోని టెలిమెడిసిన్ హబ్‌లో ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్, మెడికల్ ఆఫిసర్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో 75శాతం ఉత్తీర్ణత ఉండాలి. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 20 సా. 5.30 లోపు ఆఫ్‌లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, వైఎస్ఆర్ జిల్లా, కడప చిరునామాలో అందజేయాలి.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 1,458 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, చివరితేది ఎప్పుడంటే? (చివరితేది: 18.11.2022)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లో 1458 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 19 దరఖాస్తుకు చివరితేదీగా నిర్ణయించారు.
పోస్టుల, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..