CCL: సెంట్రల్ కోల్ ఫీల్డ్స్‌లో 139 డేటాఎంట్రీ ఉద్యోగాలు, వీరికి మాత్రమే!
రాంచీలోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ 2022-23 సంవత్సరానికి జూనియర్ డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుని అనుసరించి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
రాంచీలోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ 2022-23 సంవత్సరానికి జూనియర్ డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుని అనుసరించి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను జీఎం/హెచ్‌వోడీ డిపార్ట్‌మెంట్, జనరల్ మేనేజర్ (పీ-ఎన్ఈఈ) కార్యాలయం, సీసీఎల్, రాంచీ చిరునామాకు పంపించాలి. కంపెనీలో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని గమనించగలరు. దరఖాస్తుకు చివరితేది డిసెంబరు 6గా నిర్ణయించారు
వివరాలు..
➨ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ట్రైనీ), టీ & ఎస్ గ్రేడ్-ఇ)
ఖాళీల సంఖ్య: 139 పోస్టులు
కేటగిరీల వారీగా ఖాళీలు: యూఆర్: 99 ఎస్సీ: 33, ఎస్టీ: 07
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షకు 70 మార్కులు, ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు 30 మార్కులు కేటాయించారు. రాత పరీక్షను పార్ట్-ఎ, పార్ట్-బి రెండు భాగాలుగా నిర్వహిస్తారు. 70 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 90 నిమిషాలు.
* పార్ట్ఎ-: సబ్జెక్ట్ నాలెడ్జ్/ మెంటల్ ఎబిలిటీ/ క్వాంటిటేటివ్ ఎబిలిటీ. లాజికల్ మరియు రీజనింగ్ స్కిల్- 50 మార్కులు.
* పార్ట్-బి: జనరల్ అవేర్‌నెస్- 20 మార్కులు.
అర్హత మార్కులు: పరీక్షలో అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 40 శాతం (మార్కులు), ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం (21 మార్కులు)గా నిర్ణయించారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
GM/HOD of the department,
the office of General Manager (P-NEE), CCL, Ranchi.
ముఖ్యమైన తేదీలు..
🔰 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 16.11.2022.
🔰 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 06. 12.2022.
Also Read:
IWAI Jobs: ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నోయిడా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా డిప్యూటీ డైరెక్టర్, EDP అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఇంటర్, సంబధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో స్పీడ్‌గా టైప్ చేయకలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 12 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
EPIL Jobs: ఈపీఐఎల్‌లో మేనేజర్ ఉద్యోగాలు, దరఖాస్తుచేసుకోండి!
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్(ఈపీఐఎల్) మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబరు 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..