CBI: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు- ఎంపికైతే రూ.85,920 వరకు జీతం
central bank Vacancies: సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

CBI Recruitment of Credit Officer in Junior Management Grade Scale -I: ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) రెగ్యులర్ ప్రాతిపదికన క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1000 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా లేదా తత్సమానం ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 1000
* క్రెడిట్ ఆఫీసర్- మెయిన్ స్ట్రీమ్ (జనరల్ బ్యాంకింగ్) పోస్టులు
కేటగిరీల వారీగా ఖాళీలు: ఎస్సీ- 150 పోస్టులు, ఎస్టీ- 75 పోస్టులు, ఓబీసీ- 270 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 100 పోస్టులు, జనరల్- 405 పోస్టులు.
⋆ జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/ స్కేల్-1 (JMGS 1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ(ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ 55 శాతం) ఉత్తీర్ణత లేదా తత్సమానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 20 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.750(జీఎస్‌టీ). ఎస్సీ, ఎస్టీ, మహిళలకు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175(జీఎస్‌టీ).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఫిట్‌నెస్ తదితరాల ఆధారంగా.
పరీక్ష విధానం: ఇంగ్లిష్ లాంగ్వేజ్- 30(సమయం: 25 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 30(సమయం: 25 నిమిషాలు), రిజనింగ్ ఎబిలిటీ- 30(సమయం: 25 నిమిషాలు), జనరల్ అవేర్‌నెస్ (రిలేటెడ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ)- 30(సమయం: 25 నిమిషాలు) సబ్జెక్టుల నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కుల చొప్పున మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్(లెటర్ రైటింగ్ & ఎస్సే)-డిస్క్రిప్టివ్(సమయం: 30 నిమిషాలు) పరీక్ష 02 ప్రశ్నలకు 30 మార్కులకు ఉంటుంది. పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్- విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం. తెలంగాణ- హైదరాబాద్, వరంగల్.
పే స్కేల్: నెలకు రూ.48,480 - రూ.85,920 వరకు చెల్లిస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం..
➥ అభ్యర్థులు ముందుగా అధీకృత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ https://centralbankofindia.co.in/en కు వెళ్లి రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేసి https://centralbankofindia.co.in/en/recruitments పేజీని తెరవాలి. రిక్రూట్‌మెంట్ పేజీలో https://ibpsonline.ibps.in/cbicojan25 లింక్ ఉన్న ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను తెరవడానికి “క్రెడిట్ ఆఫీసర్స్-PGDBF సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
➥ అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో వారి ప్రాథమిక వివరాలను నమోదు చేయడం ద్వారా తమ దరఖాస్తును నమోదు చేసుకోవడానికి “NEWREGISTRATION కోసం ఇక్కడ క్లిక్ చేయండి” పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సిస్టమ్ ద్వారా తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ జనరేట్ చేయబడి స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. అభ్యర్థులు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్‌వర్డ్‌ను నోట్ చేసుకోవాలి. తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్‌వర్డ్‌ను సూచించే ఈమెయిల్ & ఎస్‌ఎంఎస్ కూడా పంపబడుతుంది. వారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి సేవ్ చేసిన డేటాను తిరిగి తెరవవచ్చు, అవసరమైతే వివరాలను సవరించవచ్చు.
➥ అభ్యర్థులు అప్‌లోడ్ చేయవలసినవి..
i. ఫోటోగ్రాఫ్
ii. సిగ్నేచర్
iii. లెఫ్ట్ థంబ్ ఇంప్రేషన్
iv. చేతితో రాసిన డిక్లరేషన్
v. పరీక్షా కేంద్రాల క్లాజు (ix) లో పేర్కొన్న సర్టిఫికెట్ (వర్తిస్తే)
vi. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో డాక్యుమెంట్ల స్కానింగ్ మరియు అప్‌లోడ్ మార్గదర్శకాలు (అనుబంధం II)లో ఇచ్చిన స్పెసిఫికేషన్ల ప్రకారం వెబ్‌క్యామ్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఫోటో తీసుకొని అప్‌లోడ్ చేయాలి.
➥ నోట్: ఫోటోగ్రాఫ్‌లు మరియు సిగ్నేచర్ అందించిన స్పెసిఫికేషన్‌ల ప్రకారం ఉండాలి, లేదంటే అభ్యర్థి దరఖాస్తు యొక్క తదుపరి దశకు వెళ్లడానికి సిస్టమ్ అనుమతించదు.
➥ ఆన్‌లైన్ దరఖాస్తులో నింపిన డేటాలో ఎటువంటి మార్పు చేయడం జరగదు కాబట్టి అభ్యర్థులు స్వయంగా ఆన్‌లైన్ దరఖాస్తును జాగ్రత్తగా పూరించాలని సూచించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే ముందు “సేవ్ అండ్ నెక్స్ట్” సౌకర్యాన్ని ఉపయోగించి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లోని వివరాలను వెరిఫై చేసి.. అవసరమైతే వాటిని సవరించాలని సూచించారు. పూర్తి రిజిస్ట్రేషన్ బటన్ పై క్లిక్ చేసిన తర్వాత అభ్యర్థులకు ఎటువంటి మార్పుకు అనుమతి లేదు. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో వివరాలను జాగ్రత్తగా వెరిఫై చేసుకొని తమ వివరాలను పూరించాలి. సమర్పణకు ముందే సరైనవో కాదో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.. ఎందుకంటే సమర్పణ తర్వాత ఎటువంటి మార్పు చేయడం సాధ్యం కాదు.
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.01.2025
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.02.2025.
✦ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 07.03.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

