Balmer Lawrie: బామర్‌లారీ అండ్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి
Balmer Lawrie Recruitment: బామర్ అండ్ కంపెనీ లిమిటెడ్ రెగ్యూలర్/ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Balmer Lawrie Recruitment: బామర్ అండ్ కంపెనీ లిమిటెడ్ రెగ్యూలర్/ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఎంటీఎం/తత్సమాన/ఎంబీఏ/గ్రాడ్యుయేట్ ఇంజినీర్/ బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఫ్రెషర్స్‌కి, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 01 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 20
⏩ మేనేజర్ (సేల్స్): 01 పోస్టు
గ్రేడ్- FTE3.
అర్హత: ఎంటీఎం/తత్సమాన/ఎంబీఏ/గ్రాడ్యుయేట్ ఇంజినీర్/ బ్యాచిలర్ డిగ్రీ, ట్రావెల్/టూరిజం మరియు సంబంధిత డొమైన్‌లలో స్పెషలైజేషన్ కలిగిన అభ్యర్థులు లేదా ట్రావెల్/టూరిజంలో అదనపు సర్టిఫికేషన్‌లు కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అనుభవం: ఎంటీఎం/తత్సమాన/ఎంబీఏ/గ్రాడ్యుయేట్ ఇంజినీర్‌లకు 6 సంవత్సరాల అనుభవం, బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు 9 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 38 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీకి 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
లోకేషన్: కోల్‌కతా.
⏩ అసిస్టెంట్ మేనేజర్(ట్రావెల్): 02 పోస్టులు
గ్రేడ్- FTE1.
అర్హత: ఎంటీఎం/తత్సమాన/ఎంబీఏ/గ్రాడ్యుయేట్ ఇంజినీర్/ బ్యాచిలర్ డిగ్రీ, ట్రావెల్/టూరిజం మరియు సంబంధిత డొమైన్‌లలో స్పెషలైజేషన్ కలిగిన అభ్యర్థులు లేదా ట్రావెల్/టూరిజంలో అదనపు సర్టిఫికేషన్‌లు కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అనుభవం: ఎంటీఎం/తత్సమాన/ఎంబీఏ/గ్రాడ్యుయేట్ ఇంజినీర్‌లకు 2 సంవత్సరాల అనుభవం, బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు 4 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీకి 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
లోకేషన్: ఢిల్లీ.
⏩ ఆఫీసర్/జూనియర్ ఆఫీసర్ (ట్రావెల్స్): 11 పోస్టులు
గ్రేడ్- FTO2 /FTO1.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు ట్రావెల్/టూరిజం మరియు సంబంధిత డొమైన్‌లలో స్పెషలైజేషన్ కలిగిన అభ్యర్థులు లేదా ట్రావెల్/టూరిజంలో అదనపు సర్టిఫికేషన్‌లు కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అనుభవం: గ్రేడ్ FTO2 -2 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి, గ్రేడ్ FTO1 కోసం -ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీకి 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
లోకేషన్: మల్టిఫుల్ లోకేషన్స్(ఢిల్లీ మరియు ధన్‌బాద్‌లో తక్షణ ఖాళీలు).
⏩ జూనియర్ ఆఫీసర్ (కమర్షియల్): 01 పోస్టు
గ్రేడ్- FTO1.
అర్హత: కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అనుభవం: ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీకి 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
లోకేషన్: ఢిల్లీ.
⏩ జూనియర్ ఆఫీసర్ (ఫారెక్స్): 01 పోస్టు
గ్రేడ్- FTO1.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు ట్రావెల్/టూరిజం మరియు సంబంధిత డొమైన్‌లలో స్పెషలైజేషన్ కలిగిన అభ్యర్థులు లేదా ట్రావెల్/టూరిజంలో అదనపు సర్టిఫికేషన్‌లు లేదా ట్రావెల్/టూరిజంలో డిప్లొమా కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అనుభవం: ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీకి 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
లోకేషన్: ఢిల్లీ.
⏩ జూనియర్ ఆఫీసర్(CHA ఆపరేషన్స్): 01
గ్రేడ్- FTO1.
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌తో పాటు ట్రేడ్ సర్టిఫికేట్ కోర్సులు(అండర్ గ్రాడ్యుయేట్) కలిగి ఉండాలి.
అనుభవం: సంబంధిత డొమైన్‌లో 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీకి 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
లోకేషన్: కోల్‌కతా.
⏩ జూనియర్ ఆఫీసర్(స్టోర్స్): 01
గ్రేడ్- FTO1.
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌తో పాటు డిప్లొమా (అండర్ గ్రాడ్యుయేట్ -ఇంజినీరింగ్) కలిగి ఉండాలి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం: 1 సంవత్సరం అనుభవం ఉండాలి. 1 సంవత్సరం ఇన్‌లాజిస్టిక్స్, ఎస్‌సీఎం, స్టోర్‌లు, కొనుగోలు, షాప్ ఫ్లోర్ లేదా రిలేటెడ్ రోల్ కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీకి 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
లోకేషన్: చిత్తూరు.
⏩ అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్): 01
గ్రేడ్- FTE1.
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్/ఎంబీఏ/తత్సమానం/గ్రాడ్యుయేట్ ఇంజినీర్ కలిగి ఉండాలి. టెక్స్‌టైల్ టెక్నాలజీ / టెక్స్‌టైల్ కెమికల్స్‌లో గ్రాడ్యుయేట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అనుభవం: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌లకు 4 సంవత్సరాలు, ఎంబీఏ/తత్సమానం/గ్రాడ్యుయేట్ ఇంజినీర్‌లకు 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి. టెక్స్‌టైల్ మార్కెటింగ్‌లో 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీకి 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
లోకేషన్: మనాలి(చెన్నై).
⏩ డిప్యూటీ మేనేజర్(క్వాలిటీ కంట్రోల్): 01
గ్రేడ్- FTE2.
అర్హత: బీఫార్మాసీ/బీఎస్సీ(కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ), ఎంఎస్సీ(ఫార్మా, కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ) కలిగి ఉండాలి.
అనుభవం: బీఫార్మాసీ/బీఎస్సీ(కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, బయో-కెమిస్ట్రీ) కలిగిన వారికి 7 సంవత్సరాలు అనుభవం, ఎంఎస్సీ(ఫార్మా, కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ) కలిగిన వారికి 4 సంవత్సరాలు అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీకి 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
లోకేషన్: మనాలి(చెన్నై).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.03.2024.