(Source: ECI/ABP News/ABP Majha)
Tech Mahindra Jobs: డిప్లొమా, డిగ్రీ అర్హతతో టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు.. రూ.1,64,000 జీతం..
దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ టెక్ మహీంద్రాలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగాల కోసం నిరీక్షించే వారికి గుడ్ న్యూస్. దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీ టెక్ మహీంద్రా.. 100 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది. చిత్తూరు జిల్లాలోని ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ (ICSTP) ద్వారా ఈ పోస్టులను టెక్ మహీంద్రా భర్తీ చేయనున్నట్లు ఏపీఎస్ఎస్‌డీసీ తెలిపింది. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు రేపటి (సెప్టెంబర్ 18) లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://apssdc.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
విద్యార్హత, వయోపరిమితి..
2015, 2016, 2017, 2018, 2019, 2020 సంవత్సరాల్లో డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారికి తెలుగు, ఇంగ్లిష్, తమిళ్ (తప్పనిసరి) / ఇంగ్లిష్, తెలుగు, కన్నడ (తప్పనిసరి) భాషలు తెలిసి ఉండాలి. టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. 20 రోజుల పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఏడాదికి రూ.1,64,000 వేతనంగా చెల్లిస్తారు. నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేసుకోండిలా..
- ఆసక్తి ఉన్న వారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ apssdc.in/industryplacements లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఈ లింక్ క్లిక్ చేశాక హోమ్ పేజీలో ICSTP - Tech Mahindra - 6th Batch సెక్షన్ కనబడుతుంది. ఇందులో More details పైన క్లిక్ చేయాలి.
- తర్వాత Apply ఆప్షన్ ఎంచుకోవాలి. దీంతో రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
- అభ్యర్థులు తమ పేరు, జిల్లా పేరు, ఆదార్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, విద్యార్హత తదితర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థుల దరఖాస్తులను టెక్ మహీంద్రా పరిశీలిస్తుంది.
- షార్ట్ లిస్ట్ అయిన వారికి హెచ్ఆర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ వివరాలను హెచ్ఆర్ వివరిస్తారు.
@AP_Skill has Collaborated with @tech_mahindra to Conduct Industry Customized Skill Training & Placement Program @chittoorgoap
— AP Skill Development (@AP_Skill) September 17, 2021
Registration Link: https://t.co/XnrotfY4b3 pic.twitter.com/YTRLgSK0Dc