News
News
X

AP Constable PET, PMT: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పటినుంచంటే?

ఏపీలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన ఫిజికల్ ఈవెంట్ల తేదీలను ఏపీ పోలీసు నియామక మండలి ఖరారు చేసింది.

FOLLOW US: 
Share:

ఏపీలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన ఫిజికల్ ఈవెంట్ల తేదీలను ఏపీ పోలీసు నియామక మండలి ఖరారు చేసింది. అభ్యర్థులకు మార్చి 13 నుంచి పీఎంటీ/ పీఈటీని నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన స్టేజీ-2 దరఖాస్తు నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 20న ముగియడంతో తదుపరి రిక్రూట్‌మెంట్ వివరాలను పోలీసు నియామక బోర్డు వెల్లడించింది. ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన కాల్ లెటర్లను మార్చి 1 నుంచి మార్చి 10 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు తెలిపింది. తుది రాతపరీక్ష ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నారు.

ఏపీలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిబ్రవరి 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాతపరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు (20.73 శాతం) ఫిజికల్ ఈవెంట్స్‌కు అర్హత సాధించారు. వీరికి మార్చి 13 నుంచి ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు.

ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 నగరాలు, పట్టణాల్లో 997 పరీక్ష కేంద్రాల్లో కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 4,58,219 మంది మాత్రమే అంటే 91 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 45,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదు. 

శారీరక ప్రమాణాలు (PMT):

🔰  ఫిజికల్ ఈవెంట్లు ఇలా..

➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

పోస్టుల వివరాలు..

* కానిస్టేబుల్ పోస్టులు 

ఖాళీల సంఖ్య: 6100

1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- సివిల్ (మెన్/ఉమెన్): 3580 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
శ్రీకాకుళం 100
విజయనగరం 134
విశాఖపట్నం (సిటీ) 187
విశాఖపట్నం (రూరల్) 159
తూర్పు గోదావరి 298
రాజమహేంద్రవరం (అర్బన్) 83
పశ్ఛిమ గోదావరి 204
కృష్ణా 150
విజయవాడ (సిటీ) 250
గుంటూరు (రూరల్) 300
గుంటూరు (అర్బన్) 80
ప్రకాశం 205
నెల్లూరు 160
కర్నూలు 285
వైఎస్సార్ - కడప  325
అనంతపురం 310
చిత్తూరు 240
తిరుపతి అర్బన్ 110
మొత్తం 3580

2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 2520 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
ఎచ్చెర్ల- శ్రీకాకుళం  630
రాజమహేంద్రవరం 630
మద్దిపాడు - ప్రకాశం  630
చిత్తూరు 630
మొత్తం 2520

కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

Also Read:

డీఏవో పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ వ‌ర్క్స్ అకౌంట్స్ స‌ర్వీస్‌లో డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ (వర్క్స్) గ్రేడ్-2, పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. 
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాల నమోదుకు అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 19న  ప్రిలిమిన‌రీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని ఫిబ్రవరి 20న ఉదయం 11 గంటలకు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పేపర్-1, పేపర్-2 పరీక్షల ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 21 Feb 2023 10:08 AM (IST) Tags: AP Police Jobs APSLPRB AP Police Physical Events AP Constable PET PMT AP Police PET Hall Tickets AP SI PMT APSLPRB Constable Physical Events

సంబంధిత కథనాలు

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

SSC Selection Posts: 5369 సెలక్షన్‌ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

SSC Selection Posts: 5369 సెలక్షన్‌ పోస్టుల దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

IPRC Notification: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 63 ఖాళీలు, అర్హతలివే!

IPRC Notification: ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 63 ఖాళీలు, అర్హతలివే!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

టాప్ స్టోరీస్

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి

Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి