![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
APPSC Recruitment: నేటి నుంచి జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?
ఏపీలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభంకానుంది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
![APPSC Recruitment: నేటి నుంచి జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే? appsc junior lecturers recruitment submission of Online applications will be started from 31 January APPSC Recruitment: నేటి నుంచి జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/31/e60c970cb0bee71bd3376ee25bcf30281706645893819522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
APPSC JL Recruitment: ఏపీలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీకి డిసెంబరు 28న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభంకానుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ జనవరి 30న ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ లేదా ఆనర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు..
* జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులు
ఖాళీల సంఖ్య: 47
జోన్లవారీగా ఖాళీలు..
జోన్-1: 12, జోన్-2: 10, జోన్-3: 09, జోన్-4: 16.
సబ్జెక్టులవారీగా ఖాళీలు..
➥ ఇంగ్లిష్: 09 పోస్టులు
➥ తెలుగు: 02 పోస్టులు
➥ ఉర్దూ: 02 పోస్టులు
➥ సంస్కృతం: 02 పోస్టులు
➥ ఒరియా: 01 పోస్టు
➥ మ్యాథమెటిక్స్: 01 పోస్టు
➥ ఫిజిక్స్: 05 పోస్టులు
➥ కెమిస్ట్రీ: 03 పోస్టులు
➥ బోటనీ: 02 పోస్టులు
➥ జువాలజీ: 01 పోస్టు
➥ ఎకనామిక్స్: 12 పోస్టులు
➥ సివిక్స్: 02 పోస్టులు
➥ హిస్టరీ: 05 పోస్టులు
అర్హత: ఎంఏ/ ఎంఎస్సీ/ఎంకామ్/బీఏ(ఆనర్స్)/ బీఎస్సీ(ఆనర్స్)/ బీకామ్ (ఆనర్స్) లేదా కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత రంగంలో ఏదైనా ఇతర సమానమైన పీజీ డిగ్రీ కలిగి ఉండాలి. సివిక్స్ సబ్జెక్టులు పొలిటికల్ సైన్స్ విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 28.12.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.
రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ(డిగ్రీ స్థాయి) - 150 ప్రశ్నలు- 150 మార్కులు- 150 నిమిషాలు; పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు (పీజీ స్థాయి) - 150 ప్రశ్నలు- 300 మార్కులు- 150 నిమిషాలు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కుకాగా.. పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ఇక ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.
కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.
జీతం: రూ.57,100 - రూ.1,47,760.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.02.2024. (11:59 PM)
➥ రాతపరీక్ష తేది: ఏప్రిల్/మే, 2024.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)