అన్వేషించండి

APPSC: 'గ్రూప్-2' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, పెరిగిన ఖాళీల సంఖ్య - ఎన్ని పోస్టులు పెరిగాయంటే?

APPSC Group2 Posts: ఏపీలో గ్రూప్-2 పోస్టుల సంఖ్యను 899 నుంచి 905 కు పెంచుతూ ఏపీపీఎస్సీ మార్చి 7న అధికారిక ప్రకటన విడుదల చేసింది. అటవీశాఖలో 6 పోస్టులను జతచేసినట్లు తెలిపింది.

APPSC Group 2 Notification: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో 899 గ్రూప్-2(Group-2) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఖాళీల్లో 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్ ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు అదనంగా 6 పోస్టులను జతచేశారు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 905కు చేరింది. ఈ మేరకు మార్చి 7న ఏపీపీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో అటవీ శాఖలో 6 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మొదట 897 గ్రూప్-2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. అటవీ శాఖలో 2 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జతచేశారు. దీంతో ఖాళీల సంఖ్య 899 కి చేరింది. తాజాగా మరో 6 పోస్టులను ఏపీపీఎస్సీ జతచేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 905 కి చేరింది.

అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. ఉదయం 10.30. గంటలకు ప్రారంభమైన ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది.  ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. 

ప్రిలిమ్స్ పరీక్షకు 87.17 శాతం అభ్యర్థలు హాజరు..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 897 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు. 

APPSC: 'గ్రూప్-2' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, పెరిగిన ఖాళీల సంఖ్య - ఎన్ని పోస్టులు పెరిగాయంటే?

వివరాలు..

* గ్రూప్-2 పోస్టులు

ఖాళీల సంఖ్య: 905 (899+6)

➥ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 333

➥ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 572

ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..

➥ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III: 04 పోస్టులు
విభాగం: ఏపీ మున్సిపల్ కమిషనర్స్ సబార్డినేట్ సర్వీస్.

➥ సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్- II: 16 పోస్టులు
విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సబార్డినేట్ సర్వీస్. 

➥ డిప్యూటీ తహసీల్దార్: 114 పోస్టులు
విభాగం: ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్.

➥ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 28 పోస్టులు
విభాగం: ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీస్.

➥ అసిస్టెంట్ రిజిస్ట్రార్: 16 పోస్టులు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్.

➥ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్

➥ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్: 152 పోస్టులు
విభాగం: ఏపీ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఏపీ హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సబార్డినేట్ సర్వీస్.

నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల వివరాలు..

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD): 218 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా): 15 పోస్టులు
విభాగం: ఏపీ సెక్రటేరియేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్): 15 పోస్టులు 
విభాగం: ఏపీ లెజిస్లేచర్ సబార్డినేట్ సబ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్): 23 పోస్టులు 
విభాగం: ఏపీ సెక్రటేరియట్ సబ్ సర్వీస్. 

➥ సీనియర్ ఆడిటర్: 08 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సబ్ సర్వీస్.

➥ ఆడిటర్: 10 పోస్టులు
విభాగం: పే & అకౌంట్ సబార్డినేట్ సర్వీస్. 

➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1 HOD): 01 పోస్టు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్.

➥ సీనియర్ అకౌంటెంట్ (కేటగిరీ-1): 12 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ (డిస్ట్రిక్ట్) సబ్ సర్వీస్

➥ సీనియర్ అకౌంటెంట్: 02 పోస్టులు
విభాగం: ఏపీ వర్క్స్ & అకౌంట్స్ సబ్ సర్వీస్. 

➥ జూనియర్ అకౌంటెంట్: 22 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్. 

➥ జూనియర్ అసిస్టెంట్: 248 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు: ఏపీపీఎస్సీ-32, ఎకనామిక్స్ & స్టాటిటిక్స్-06, సోషల్ వెల్ఫేర్-01, కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లయ్స్-13, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్-02, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చరల్ కోఆపరేషన్-07, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్-31, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్-07, కమిషనర్ ఆఫ్ లేబర్-03, డైరెక్టర్ ఆఫ్ ఏనిమల్ హస్బెండరీ-07, డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్-03, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)-08, డీజీ -ప్రిసన్స్ & కోరిలేషనల్ సర్వీసెస్-02, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్-02, డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్-02, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏపీ-08, ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-01, పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్-19, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్-02, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్-04, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్-01, డైరెక్టర్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్-03, ఇండస్ట్రియల్ ట్రైబ్యూనల్ కమ్ లేబర్ కోర్ట్-02, ఇంజినీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్-02, డైరెక్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్-02, ఇంజినీర్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్-05, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్-12, డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్-01, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్-20, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్ & బి-07, ఉమెన్ డెవలప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్-02, డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ & వాటర్ ఆడిట్-01, కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్-01, కమిషనర్ ఆఫ్ ఆర్కియోలజీ అండ్ మ్యూజియమ్స్-01, ఇంజినీరింగ్ రిసెర్చ్ ల్యాబ్స్-01, ప్రివెంటివ్ మెడిసిన్-01, గవర్నమెంట్ టెక్స్ బుక్ ప్రెస్-01, కమిషనరల్ ఆఫ్ ఇండస్ట్రీస్-05, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీసెస్-02, టెక్నికల్ ఎడ్యుకేషన్-09, ఆర్‌డబ్ల్యూఎస్ & ఎస్-01, ప్రిన్సిపల్ చీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్-08.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష విధానం:

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Notification

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget