అన్వేషించండి

APPSC Group-1 Halltickets: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్! డౌన్‌లోడ్ ఎప్పటినుంచంటే?

ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమ్స్ (స్ర్కీనింగ్ టెస్ట్) పరీక్ష హాల్‌టికెట్లు మార్చి 10 నుంచి అందుబాటులో ఉంటాయని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

APPSC Group1 Prelims Halltickets: ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమ్స్ (స్ర్కీనింగ్ టెస్ట్) పరీక్ష హాల్‌టికెట్లు మార్చి 10 నుంచి అందుబాటులో ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ సెక్రటరీ మార్చి 8న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను క్షుణ్నంగా చదువుకోవాలని కమిషన్ సెక్రటరీ తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని ఆయన సూచించారు.

ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 81 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించనున్నారు.

APPSC Group-1 Halltickets: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్! డౌన్‌లోడ్ ఎప్పటినుంచంటే?

గ్రూప్-1 పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 81

1) డిప్యూటీ కలెక్టర్: 09 పోస్టులు
విభాగం: ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్).
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-1,51,370/-

2) అసిస్టెంట్ కమిషనర్: 18 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-1,51,370/-

3) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-డీఎస్పీ (సివిల్) క్యాట్-2: 26 పోస్టులు
విభాగం: ఏపీ పోలీస్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-1,51,370/-

4) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-(మెన్): 01 పోస్టు 
విభాగం: ఏపీ జైళ్ల శాఖ.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

5) డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ (ఫైర్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

6)  రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్: 06 పోస్టులు
విభాగం: ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

7) డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

8) డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్: 03 పోస్టులు
విభాగం: ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

9) డిప్యూటీ రిజిస్ట్రార్: 05 పోస్టులు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

10) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2): 01 పోస్టు
విభాగం: ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

11) అసిస్టెంట్ ప్రొహిభిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్: 01 పోస్టు
విభాగం: ఏపీ ఎక్సైజ్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

12)  అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 03 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీ/అకౌంట్స్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

3) డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్: 04 పోస్టులు
విభాగం: ఏపీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

14) అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

ప్రిలిమ్స్ పరీక్ష విధానం:
మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇందులో పేపర్-1లో 120 ప్రశ్నలు-120 మార్కులు, పేపర్-2లో 120 ప్రశ్నలు-120 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపరుకు 2 గంటల సమయం కేటాయించారు. పేపర్-1లో హిస్టరీ అండ్ కల్చర్ (పార్ట్-ఎ); కాన్‌స్టిట్యూషన్ పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (;పార్ట్-బి), ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ & ప్లానింగ్ (పార్ట్-సి), జియోగ్రఫీ (పార్ట్-డి) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

Group1 Application: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

మెయిన్స్ పరీక్ష విధానం..
మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితోపాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు కూడా ఉంటాయి. అయితే ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం 825 మార్కులకు అభ్యర్థుల ఎంపికను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 180 నిమిషాలు (3 గంటలు) కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 

Group1 Application: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget