HAL Recruitment: హైదరాబాద్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో 82 అప్రెంటీస్ ఖాళీలు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2022-23 ఏడాదికిగానూ పలు విభాగాల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ..
హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 2022-23 ఏడాదికిగానూ పలు విభాగాల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, డిప్లొమా, బీకాం, బీఎస్సీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు..
* అప్రెంటిస్
మొత్తం ఖాళీలు: 82 పోస్టులు
1) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 26 పోస్టులు
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్
2) టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 34 పోస్టులు
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్,
మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంఎల్‌టీ
3) జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 22 పోస్టులు
విభాగం: బీకాం, బీఎస్సీ నర్సింగ్/కెమిస్ట్రీ/కంప్యూటర్స్.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఇంటర్వ్యూ నిర్వహణ: సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో
రిపోర్టింగ్ సమయం: ఉదయం 9.30 గంటలకు
ఇంటర్వ్యూ వేదిక:
Auditorium, Behind Department of Training & Development,
Hindustan Aeronautics Limited, Avionics Division,
Hyderabad, Balanagar, Hyderabad.
Also Read:
UPSC: సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్, పరీక్షలు ఎప్పుడంటే?
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2022 పరీక్షల హాల్‌టికెట్లను యూపీఎస్సీ విడుదల చేసింది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్ష కోసం తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 11,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
FCI Recruitment 2022: ఎఫ్‌సీఐలో 5 వేలకుపైగా ఉద్యోగాలు!
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్ III, ఇతరుల దరఖాస్తుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తితో పాటు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అయితే ఎఫ్సీఐ 2022 రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతం వివరాలు మరియు దరఖాస్తు రుసుము,
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
AOC Jobs: ఆర్మీ ఏవోసీ రీజియన్లలో 3068 ఉద్యోగాలు, ఈ అర్హతలుంటే చాలు!
సికింద్రాబాద్‌లోని సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్- ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఏవోసీ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్, జేఏవో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్, ఐటీఐ విద్యార్హతలు కలిగి ఉండాలి. ఫిజికల్/ ప్రాక్టికల్/ స్కిల్ పరీక్షలు, రాత పరీక్ష, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..