AP DME: ఏపీ డీఎంఈలో 480 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
DME AP Recruitment 2023: ఏపీ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 10 ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 21 స్పెషాలిటీల్లో 480 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
DME AP Recruitment 2023: ఆంధ్రప్రదేశ్‌లో, ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) పరిధిలో కొత్తగా ఏర్పాటైన 10 ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 21 స్పెషాలిటీల్లో మొత్తం 480 సీనియర్ రెసిడెంట్ (Senior Residents) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందులలో ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 23న జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఏడాదిపాటు పని చేయాల్సి ఉంటుంది.
వివరాలు..
సీనియర్ రెసిడెంట్: 480 పోస్టులు
మెడికల్ కాలేజీలవారీగా ఖాళీలు: విజయనగరం-50, రాజమహేంద్రవరం-50, ఏలూరు-56, మచిలీపట్నం-65, నంద్యాల-49, పాడేరు-42, మార్కాపురం-42, మదనపల్లి-42, ఆదోని-42, పులివెందుల-42.
స్పెషాలిటీలవారీగా ఖాళీలు..
➥ అనాటమీ: 49
➥ ఫిజియాలజీ: 29
➥ బయోకెమిస్ట్రీ: 39
➥ ఫార్మకాలజీ: 25
➥ పాథాలజీ: 22
➥ మైక్రోబయాలజీ: 23
➥ ఫోరెన్సిక్ మెడిసిన్: 20
➥ కమ్యూనిటీ మెడిసిన్: 23
➥ జనరల్ మెడిసిన్: 34
➥ పీడియాట్రిక్స్: 15
➥ రెస్పిరేటరీ మెడిసిన్: 07
➥ డీవీఎల్: 07
➥ సైకియాట్రీ: 05
➥ జనరల్ సర్జరీ: 27
➥ ఆర్థోపెడిక్స్: 09
➥ ఓటోరినోలారింగాలజీ: 07
➥ ఆప్తల్మాలజీ: 09
➥ ఓబీజీ: 13
➥ అనెస్తీషియాలజీ: 17
➥ రేడియోడయాగ్నసిస్: 25
➥ ఎమర్జెన్సీ మెడిసిన్: 75
అర్హత: మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 44 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.500, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250.
ఎంపిక విధానం: పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
జీత భత్యాలు: నెలకు రూ.70,000 ఉంటుంది.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 23.11.2023.
ఇంటర్వ్యూ వేదిక:
DME Office,
Old GGH campus,
Hanumanpet, Vijayawada.
వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు వెంట తీసుకురావల్సిన డాక్యుమెంట్లు..
➥ పుట్టినతేది ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో (S.S.C. certificate)
➥ పీజీ డిగ్రీతోపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వానికి సంబంధించిన సర్టిఫికేట్
➥ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ) మార్కుల జాబితా. మార్కుల జాబితా లేని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
➥ ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ) ప్రొవిజినల్ డిగ్రీ సర్టిఫికేట్లు.
➥ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ (SC/ ST/ BCA/ BCB/ BCC/ BCD/ BCE/ EWS)
➥ ఆధార్ కార్డు
➥ 4 నుంచి 10వ తరగతుల వరకు స్టడీ సర్టిఫికేట్లు. (తెలంగాణలో చదివినవారికి)
ALSO READ:
రాజమహేంద్రవరం ప్రభుత్వమెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో 77 ఉద్యోగాలు, ఇవీ అర్హతలు
రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 77 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 29లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..