అన్వేషించండి

DCCB Eluru Jobs: ఏలూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో 95 క్లర్క్ పోస్టులు, అర్హతలివే!

ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి నవంబరు 20వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 5న ప్రారంభంకాగా.. నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి నవంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు:


* స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్: 95 పోస్టులు


పోస్టుల కేటాయింపు:
ఓసీ - 42, బీసీ - 27, ఎస్సీ - 13, ఎస్టీ - 06, దివ్యాంగులు - 05, ఎక్స్-సర్వీస్‌మెన్ - 02. మొత్తం పోస్టుల్లో మహిళలకు 31 పోస్టులు, పురుషులకు 64 పోస్టులు కేటాయించారు.

అర్హత:
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఇంటర్‌తోపాటు JDC/HDC/DCRS కోర్సులు చేసి ఉండాలి. ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

వయోపరిమితి:
01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు:
జనరల్, బీసీ అభ్యర్థులు రూ.590 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌ మెన్, దివ్యాంగులు రూ.413 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం:
ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష విధానం
: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, రీజనింగ్ 35 ప్రశ్నలు-35 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.

జీత భత్యాలు:
నెలకు రూ.17,900 - రూ.47,920. ఇతర భత్యాలు అదనం. ఇతర భత్యాలతో కలిపి ప్రారంభంలో నెలకు రూ.26,950 అందుతుంది.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.11.2022.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 20.11.2022.
* దరఖాస్తుల సవరణ, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 20.11.2022.
* దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 05.12.2022.
* ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ తేదీ: డిసెంబర్ 2022.

Notification

Online Application

Website

Also Read:

 

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, దరఖాస్తు చేసుకోండి!
ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 15లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

SSC CGL 2022 Exam Date: సీజీఎల్-2022 'టైర్-1' పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవలే  కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్(SSC CGL)-2022 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు 19, 20 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. 
పరీక్ష తేదీలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంకులో బ్రాండ్ మేనేజర్/అడ్మినిస్ట్రేటర్ పోస్టులు, వివరాలు ఇలా!
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఒప్పంద ప్రాతిపదికన ఆప్కాబ్ శాఖల్లో బ్రాండ్ మేనేజర్/ అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సీఏఐఐబీ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబర్ 7లోపు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకొని, దరఖాస్తు నింపిన తర్వాత  నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pushpa 2 Censor: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
Crime News: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
Embed widget