News
News
X

AP Police SI Exam: రేపే 'ఎస్‌ఐ' ప్రిలిమినరీ పరీక్ష, నిమిషం ఆలస్యమైనా 'నో ఎంట్రీ'! ఇవి పాటించాల్సిందే!

19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష జరుగనుంది. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేదిలేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

FOLLOW US: 
Share:

ఏపీలో పోలీసు ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 291 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష జరుగనుంది. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేదిలేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు కేంద్రంలోకి అనుమతించరు.

రాష్ట్రంలో మొత్తం 411 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 1,71,936 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 418 మంది పోటీ పడుతున్నారు.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అభ్యర్థులు ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. 

➥ నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి అనుమతించరు. కాబట్టి గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా చూసుకోవాలి. 

➥ అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్ కార్డు వంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాల్సి ఉంటుంది.

➥ అభ్యర్థులు మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్‌వాచ్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, పర్సు, నోట్సు, ఛార్టులు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. 

➥ మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదు. విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో క్లోక్‌రూం సదుపాయం ఉండదు. 

➥ అభ్యర్థులు చేతులకు మెహిందీ, టాటూలు ఉంచుకోవద్దు.  

➥ అభ్యర్థి పరీక్ష గదిలోకి హాల్‌టికెట్‌తో పాటు బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నును మాత్రమే తీసుకెళ్లాలి.

➥ ఓఎంఆర్‌ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు వంటివి రాస్తే మాల్‌ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.

➥ పరీక్షపత్రం బుక్‌లెట్‌లో ఇంగ్లిష్‌-తెలుగు, ఇంగ్లిష్‌-ఉర్దూ భాషలలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలుంటే ఇంగ్లిష్‌ వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలి.

పోస్టుల వివరాలు..

* సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు 

ఖాళీల సంఖ్య: 411

1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) ఎస్‌ఐ- సివిల్ (మెన్/ఉమెన్): 315 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జోన్ జిల్లా/ఏరియా పోస్టులు
జోన్-1 (విశాఖపట్నం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 50
జోన్-2 (ఏలూరు) తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 105
జోన్-3 (గుంటూరు) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 55
జోన్-4 (కర్నూలు) చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప 105
  మొత్తం  315

2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 96 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
ఎచ్చెర్ల- శ్రీకాకుళం  24
రాజమహేంద్రవరం 24
మద్దిపాడు - ప్రకాశం  24
చిత్తూరు 24
మొత్తం 96

ఎస్‌ఐ ఉద్యోగాల నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

Website

ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ ద్వారా.

🔰 ప్రిలిమినరీ పరీక్ష విధానం:

➨ ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

➨ పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.

➨ ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష ఉంటుంది.

➨ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.

➨ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు.

➨ అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

🔰 మెయిన్ పరీక్ష విధానం: 

➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

➨  సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

➨  ఏపీఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

🔰  ఫిజికల్ ఈవెంట్లు ఇలా..

➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

Also Read: ఏపీ పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, 'పార్ట్-2' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఇదే!

Also Read: ఏపీలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1428 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 18 Feb 2023 11:13 PM (IST) Tags: Instructions to candidates AP Police SI Exam SI Preliminary Exam Hall Ticket SI Preliminary Exam Admit Card AP Plioce SI Preliminary Exam AP SI Prelims Exam

సంబంధిత కథనాలు

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

L&T Recruitment 2023: ఎల్‌ & టీలో ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలు ఇవే!

L&T Recruitment 2023: ఎల్‌ & టీలో ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలు ఇవే!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో  మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

TSPSC Updates : టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులనూ ప్రశ్నించనున్న సిట్ - నోటీసులు జారీ !

TSPSC Updates :  టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులనూ ప్రశ్నించనున్న సిట్ - నోటీసులు జారీ !

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి